టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌పై లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒక విషయంలో కోహ్లీని హిట్‌మ్యాన్ ఫాలో అవ్వాలన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌పై లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒక విషయంలో కోహ్లీని హిట్‌మ్యాన్ ఫాలో అవ్వాలన్నాడు.
వరల్డ్ కప్-2023 హడావుడి తగ్గడంతో ఇప్పుడు అందరి ఫోకస్ రాబోయే టీ20 ప్రపంచ కప్‌పై పడింది. వచ్చే ఏడాది జూన్‌లో పొట్టి ఫార్మాట్ కప్పు కోసం టీమ్స్ అన్నీ పోటీపడనున్నాయి. అయితే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యూచర్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 35 ఏళ్లకు పైబడిన ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు ఎక్కువ సంవత్సరాలు కెరీర్‌ను కంటిన్యూ చేసే అవకాశం కనిపించడం లేదు. ఫిట్‌గా ఉండి, చక్కగా ప్లాన్ చేసుకుంటే మరో మూడ్నాలుగేళ్లు వీళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. టెస్టులు మాత్రమే ఆడితే ఎక్కువ కాలం పాటు కంటిన్యూ అవ్వొచ్చు. టీ20లు వదిలి వన్డేలు, టెస్టులు ఆడితే ఇబ్బంది లేదు. కానీ పొట్టి ఫార్మాట్లోనూ కొనసాగాలనుకుంటే మాత్రం చాన్నాళ్ల పాటు టీమిండియాకు ఆడటం కష్టమవుతుంది.
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ కెరీర్ విషయంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఏ డెసిషన్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే బోర్డు మాత్రం కెరీర్ పై తుది నిర్ణయాన్ని రోహిత్, విరాట్ ఇష్టానికే వదిలేసిందని క్రికెట్ వర్గాల సమాచారం. లెజెండరీ క్రికెటర్స్‌కు ఈ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందని టాక్. ఒకవేళ అదే నిజమైతే తమ ఫిట్నెస్, ఫోకస్, ఫ్యూచర్ ప్లాన్స్‌కు తగ్గట్లు రోహిత్, కోహ్లీ డెసిషన్ తీసుకోవచ్చు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసినందున భారత క్రికెట్ టీమ్‌లో కీలక మార్పులపై హిట్‌మ్యాన్‌తో బీసీసీఐ త్వరలో డిస్కస్ చేయనుందని తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో వైట్‌బాల్ క్రికెట్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద రోహిత్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో బోర్డు చర్చించనుందట.
కెరీర్ విషయంలో రోహిత్ శర్మ పక్కా క్లారిటీ ఉన్నాడని తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌కు తన పేరును ప్రస్తావించకపోయినా ఇబ్బంది లేదని ఇప్పటికే బీసీసీఐకి హిట్‌మ్యాన్ సిగ్నల్స్ ఇచ్చాడని వినికిడి. మరోవైపు సెలక్టర్లు కూడా టీ20 టీమ్‌లో పూర్తిగా యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. మొత్తం యువరక్తంతో జట్టును నింపేయాలని చూస్తున్నారట. టీ20 వరల్డ్ కప్‌కు మరో ఏడు నెలల టైమ్ ఉండటంతో ఈ వ్యూహం నుంచి వెనక్కి తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు. వచ్చే కొన్నేళ్లలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా ఉన్న నేపథ్యంలో వీటి మీద కాన్సంట్రేట్ చేయాలని రోహిత్ ఫిక్స్ అయ్యాడట.
టీ20 వరల్డ్ కప్‌కు మరో 7 నెలల సమయమే ఉంది కాబట్టి రోహిత్, కోహ్లీని పక్కనబెట్టేందుకు బీసీసీఐ సాహసం చేయకపోవచ్చని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అలాగే ప్రపంచ కప్ నెగ్గాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు ఈ రూపంలో వారికి మరో ఛాన్స్ కూడా ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ మాదిరిగా ఫిట్నెస్ కాపాడుకుంటే రోహిత్ శర్మ మరో వరల్డ్ కప్ ఆడగలడని అన్నాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని ఫాలో అయితే హిట్‌మ్యాన్ తప్పకుండా మరో ప్రపంచ కప్‌లో ఆడతాడని చెప్పాడు. మరి.. రోహిత్ఫై మురళీధరన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్-కోహ్లీ కెరీర్‌పై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్.. అలా చేస్తే బెటర్ అంటూ..!
Muttiah Muralitharan has backed Rohit Sharma to play in the ICC T20 World Cup 2024
📷: BCCI#RohithSharma𓃵 #RohithSharma #Muralitharan #worldcup #teamindia #CricketWorldCup2024 pic.twitter.com/uTaPTIMvsN
— SportsTiger (@The_SportsTiger) November 25, 2023