SNP
Rohit Sharma, Virat Kohli, IND vs SL: శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్, విరాట్, బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma, Virat Kohli, IND vs SL: శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్, విరాట్, బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో చాలా మందికి రెస్ట్ ఇవ్వడంతో.. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యంగ్ టీమిండియా జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కూడా ముగిశాయి. అలాగే ఈ నెల 27 నుంచి భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్ వెళ్తోంది. అయితే.. ఇప్పటికే టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్ధిక్ పాండ్యా, బుమ్రా, పంత్‌లతో కూడిన యంగ్ టీమిండియానే లంకను ఢీకొట్టనుంది.
అయితే.. మూడు వన్డేలకు ఎలాంటి జట్టును ప్రకటిస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ, రోహిత్‌లు వన్డేలు, టెస్టుల్లో ఆడనున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ తర్వాత.. జరిగే తొలి వన్డే సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో ఆడి అలసినపోయిన ఆటగాళ్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇది కేవలం వారికి రెస్ట్ మాత్రమే కాదని, దాని వెనుక పెద్ద ప్లాన్ ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతో కీలకమైన ఆటగాళ్లు. పైగా వన్డే, టెస్ట్ లాంటి ఫార్మాట్స్‌లో వీళ్లిద్దరే మెయిన్ పిల్లర్స్. వచ్చే ఏడాది రెండు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరీలో ఛాంపియ్స్ ట్రోఫీ, జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి. ఈ రెండు ట్రోఫీలపై భారత్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఆ రెండు ట్రోఫీలు కొట్టాలనే టార్గెట్‌ను పెట్టుకున్నట్లు సమాచారం. అందుకోసం వన్డే, టెస్టుల్లో కీలకమైన రోహిత్, కోహ్లీలపై వర్క్ లోడ్ పడకుండా, వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకుని.. కావాల్సినంత రెస్ట్ ఇస్తూ.. బిగ్ టోర్నమెంట్స్‌కు, పెద్ద టీమ్స్‌లో మ్యాచ్‌లకు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే లంక లాంటి చిన్న టీమ్‌తో వారి అవసరం లేదని భావించి.. వారికి రెస్ట్ ఇస్తోంది. సో.. లంకతో సిరీస్‌లో వారికి రెస్ట్ ఇవ్వడం వెనుక రెండు ట్రోఫీలు కొట్టే ప్లాన్ ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Rohit Sharma, Virat Kohli, and Jasprit Bumrah are not part of the SL tour as the BCCI prioritizes their rest before the upcoming home season. pic.twitter.com/GjBR6LD5OO
— CricketGully (@thecricketgully) July 8, 2024