వీడియో: కోహ్లీ బ్యాటింగ్‌ ఎంజాయ్‌ చేస్తూ.. RCBకి సపోర్ట్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌!

Riyan Parag, Virat Kohli, RCB vs PBKS, IPL 2024: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న ఓ స్టార్‌ ప్లేయర్‌.. ఆర్సీబీ సపోర్టర్‌గా మారిపోయాడు. పంజాబ్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. వీడియో కూడా పోస్ట్‌ చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Riyan Parag, Virat Kohli, RCB vs PBKS, IPL 2024: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న ఓ స్టార్‌ ప్లేయర్‌.. ఆర్సీబీ సపోర్టర్‌గా మారిపోయాడు. పంజాబ్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. వీడియో కూడా పోస్ట్‌ చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్‌ 2024లో ఎంతో కీలకమైన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 60 పరుగుల తేడాతో బంపర్‌ విక్టరీ కొట్టింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సులతో 92 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. కోహ్లీతో పాటు రజత్‌ పాటిదార్‌, కామెరున్‌ గ్రీన్‌ చెలరేగడంతో ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసి.. పంజాబ్‌ను 181కే ఆలౌట్‌ చేసి.. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. ఆర్సీబీకి సపోర్ట్‌ చేశాడు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న ఓ స్టార్‌ బ్యాటర్‌. మ్యాచ్‌ చూస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరి.. ఆర్సీబీకి తన సపోర్ట్‌ను అందించాడు.

ఇంతకీ ఆర్సీబీకి సపోర్ట్‌ చేసిన ఆ స్టార్‌ బ్యాటర్‌ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు రియాన్‌ పరాగ్‌. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న పరాగ్‌.. గురువారం ఆర్సీబీ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌లో ఆర్సీబీకి మద్దతు పలికాదు. విరాట్‌ కోహ్లీ సిక్స్‌ కొడుతున్న సమయంలో ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ ఆర్సీబీనే గెలుస్తుందంటూ ముందే చెప్పేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేసిన పరాగ్‌.. ఆర్సీబీ గెలిచిన తర్వాత సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతూ.. ఆర్సీబీకి రియాన్‌ పరాగ్‌ సపోర్ట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందంతా కోహ్లీపై ఉన్న ఇష్టంతో చేసిందే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. పరాగ్‌, విరాట్‌ కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ అనే విషయం తెలిసిందే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 92, రజత్‌ పాటిదార్‌ 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55, కామెరున్‌ గ్రీన్‌ 27 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. డీకే 7 బంతుల్లో 18 రన్స్‌ చేసి.. వేగంగా ఆడే క్రమంలో అవుట్‌ అయ్యాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, కావేరప్ప 2, అర్షదీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ తీశారు. ఇక 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌.. 17 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. రిలీ రోసోవ్‌ 61, శశాంక్‌ సింగ్‌ 37 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ 3, స్వప్నిల్‌ సింగ్‌ 2, ఫెర్గుసన్‌ 2, కరణ్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌ చూస్తూ.. రియాన్‌ పరాగ్‌ ఆర్సీబీకి తన సపోర్ట్‌ తెలియజేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments