టీ20 టోర్నీలు వచ్చాక ప్రతి మ్యాచ్.. ఒకదాన్ని మించి మరోటి అభిమానులకు థ్రిల్లింగ్ ను పంచుతున్నాయి. నరాలుతెగే ఉత్కంఠతతో టీ20 మ్యాచ్ లు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీ20ల్లో బెస్ట్ ఫినిషింగ్ మ్యాచ్ ఏదంటే? మాత్రం 2023 ఐపీఎల్ సీజన్లో జరిగిన గుజరాత్ టైటాన్స్-కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచే గుర్తుకువస్తుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలి అంటే.. చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్ లు కొట్టాలి. అయితే గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ వేసిన ఈ ఓవర్లో ఎవ్వరూ ఊహించని రీతిలో వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ ను గెలిపించాడు యువకెరటం రింకూ సింగ్. ఇప్పుడు ఈ మ్యాచ్ ను తలదన్నేలా అంతకు మించి టీ20 చరిత్రలోనే బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు యంగ్ ప్లేయర్ రితికేష్ ఈశ్వరన్. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో క్వాలిఫయర్ 2లో భాగంగా.. నెల్లై రాయల్ కింగ్స్ వర్సెస్ దిండిగల్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓడిపోతుంది అనుకున్న నెల్లై రాయల్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. నరాలు తెగే ఉత్కంఠతతో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచింది ఈ మ్యాచ్. చివరి మూడు ఓవర్లలో నెల్లై టీమ్ 50 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో క్రీజ్ లో ఉన్న అజితేష్ గురుస్వామి, రితికేష్ ఈశ్వరన్ దిండిగల్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించారు. మరీ ముఖ్యంగా రితికేష్ ఈశ్వరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలోనే దిండిగల్ బౌలర్ కిశోర్ వేసిన 19వ ఓవర్లో ఈశ్వరన్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అజితేష్ కూడా ఓ సిక్సర్ కొట్టడంతో.. మెుత్తంగా ఈ ఓవర్లో 33 పరుగులు వచ్చాయి. ఈశ్వరన్ కేవలం 11 బంతుల్లోనే 6 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. ఇక అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 350 ఉండటం విశేషం. గుజరాత్ తో మ్యాచ్ లో విరుచుకుపడ్డ రింకూ సింగ్ స్ట్రైక్ రేట్ 228 ఉండటం గమనార్హం. ఈశ్వరన్ సూపర్ పవర్ హిట్టింగ్ తో నెల్లై రాయల్ కింగ్స్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరి రింకూ సింగ్ ను మించిన హిట్టింగ్ తో జట్టును గెలిపించిన ఈశ్వరన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One of the craziest striking! 37 needed in 12 balls – 6,6,6,1,6,N1,6.
33 runs from the penultimate over, insane striking from Rithik Easwaran and Ajitesh Guruswamy in TNPL Qualifier. pic.twitter.com/jhToGDKkM1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2023
ఇదికూడా చదవండి: ఆ విషయంలో కోహ్లీనే టాప్! సచిన్, ధోని సైతం వెనుకే