SNP
టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా చెప్పుకునే రిషభ్ పంత్ తిరిగి బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2024తో తన గ్రాండ్ ఎంట్రీ చాటనున్నాడు. అయితే.. పంత్ ఎంట్రీపై బీసీసీఐ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక కండీషన్ పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా చెప్పుకునే రిషభ్ పంత్ తిరిగి బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2024తో తన గ్రాండ్ ఎంట్రీ చాటనున్నాడు. అయితే.. పంత్ ఎంట్రీపై బీసీసీఐ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక కండీషన్ పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులకు ఢిల్లీ క్యాపిటల్స్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2024లో పంత్ బరిలోకి దిగుతాడని అధికారికంగా వెల్లడించింది. గతేడాది పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్ కు వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు. భారీ ప్రమాదం జరిగినా.. అదృష్టవశాత్తు పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన పంత్.. అనంతరం ఇంటికే పరిమితం అయ్యాడు. నిదానంగా కోలుకుని.. కొన్ని వారాల క్రితం బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ రీహ్యాబ్ అవుతున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న అతను.. ప్రస్తుతం క్రికెట్ ను పూర్తి స్థాయిలో ఆడేందుకు ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ నేతృత్వంలో పంత్.. వేగంగా రికవరీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పంత్ తిరిగి టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడా? ఐపీఎల్ 2024 ఆడతాడా? లేదా అనే అనుమానాలు క్రికెట్ వర్గాల్లో నెలకొన్నాయి. వాటికి సమాధానంగా ఐపీఎల్‌లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టతను ఇచ్చింది. ఐపీఎల్ 2024లో పంత్ బరిలోకి దిగుతాడని పేర్కొంది. అయితే.. పంత్ ఐపీఎల్ ఆడేది కన్ఫామ్ అయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు బీసీసీఐ ఒక పెద్ద కండీషన్ పెట్టింది. ఢిల్లీ టీమ్ కు పంత్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీతో పాటు పంత్ వికెట్ కీపర్ కూడా. అయితే.. టీమిండియాకు ఎంతో కీలకమైన ఆటగాడు కావడంతో పంత్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
అతని విషయంలో అసలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టం పడటం లేదు. ఒకవేళ పంత్ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నా.. అతనికి ఎన్‌సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. పంత్ పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉన్నాడని ఎన్‌సీఏ నిర్ధారిస్తేనే పంత్ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు వీలుంటుంది. ఒకవేళ ఎన్‌సీఏ పంత్ చేత వికెట్ కీపింగ్ చేయించొద్దని చెప్తే.. అందుకే కూడా ఢిల్లీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పంత్ జస్ట్ ఫీల్డర్ గా బరిలోకి దిగి కెప్టెన్సీ చేస్తే చాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఎన్‌సీఏ ఇచ్చే సూచనల ఆధారంగానే పంత్ ను బరిలోకి దింపుతామని ఇప్పటికే ఢిల్లీ యాజమాన్యం స్పష్టం చేసింది. మరి పంత్ ఐపీఎల్ బరిలోకి దిగడం, బీసీసీఐ కండీషన్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Just in: Rishabh Pant is set to return to lead Delhi Capitals next season in the IPL
ESPNcricinfo has learned that the franchise expects Pant to be fully fit by end of February 🏏 #IPL2024 pic.twitter.com/ARM9ZRurQt
— ESPNcricinfo (@ESPNcricinfo) December 11, 2023