IPL 2024లో రిషభ్‌ పంత్‌ రోల్‌పై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది!

Rishabh Pant: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌.. కారు ప్రమాదం తర్వాత ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌ 2024లో కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కానీ, ఎలాంటి రోల్‌ పోషిస్తాడనే దానిపై క్లారిటీ లేదు. తాజా దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌.. కారు ప్రమాదం తర్వాత ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌ 2024లో కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కానీ, ఎలాంటి రోల్‌ పోషిస్తాడనే దానిపై క్లారిటీ లేదు. తాజా దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ కోసం ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం అవుతుందంటూ తాజాగా ఒక లేటెస్ట్‌ అప్డేట్‌ సైతం హల్చల్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గురించి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో పంత్‌ బరిలోకి దిగడం ఇప్పటికే ఫిక్స్‌ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 మినీ వేలంలో కూడా పంత్‌ పాల్గొన్నాడు. ఇప్పుడు మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ కూడా వచ్చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2022 డిసెంబర్‌లో రిషభ్‌ పంత్‌ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పంతే డ్రైవింగ్‌ చేస్తున్నాడు. నిద్రమత్తులో జరిగిన ప్రమాదంలో కారు మొత్తం మంటల్లో కాలిపోయి బూడిదైంది. అదృష్టం కొద్ది కారు నుంచి బయటపడిన పంత్‌ ప్రాణాలు కాపాడుకున్నాడు. లేకుంటే.. అదే కారులో కాలి బూడిదయ్యేవాడు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత.. చికిత్స తీసుకున్న పంత్‌.. కాలికి తీవ్ర గాయం కావడంతో క్రికెట్‌కు చాలా కాలం దూరమయ్యాడు.

ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుని బ్యాట్‌ పట్టి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిహ్యాబ్‌ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆడతాడని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ కన్ఫామ్‌ చేసింది. కానీ, ఢిల్లీ జట్టుకు పంత్‌ కెప్టెన్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కూడా. అయితే.. కాలికి తీవ్రమైన గాయం కావడంతో పంత్‌ అప్పుడు వికెట్‌ కీపింగ్‌ చేయడం అంత మంచిది కాదని, అందుకే కేవలం బ్యాటర్‌గానే కొనసాగించాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు, అందుకే బీసీసీఐ కూడా అంగీకరించినట్లు సమాచారం. దీంతో.. ఐపీఎల్‌ 2024లో పంత్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడనున్నాడు. వికెట్‌ కీపర్‌గా మరో ప్లేయర్‌ను ఢిల్లీ బరిలోకి దింపనుంది. మరి పంత్‌ కేవలం బ్యాటర్‌గా ఐపీఎల్‌ బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments