ఢిల్లీని వదిలి.. చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి రిషభ్‌ పంత్‌?

Rishabh Pant, Delhi Capitals, CSK, IPL 2025: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌ 2025కి ముందే సీఎస్‌కేలో చేరుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rishabh Pant, Delhi Capitals, CSK, IPL 2025: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌ 2025కి ముందే సీఎస్‌కేలో చేరుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు అదిరిపొయే గుడ్‌న్యూస్‌ అందుతోంది. ఇప్పటికే ధోని కారణంగా భారీ ఫ్యాన్‌ బేస్‌ కలిగి ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ మరింత పవర్‌ యాడ్‌ కానుంది. ప్యాకెట్‌ డైనమైట్‌ రిషభ్‌ పంత్‌ సైతం సీఎస్‌లోకి వస్తాడంటూ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను నుంచి రిషభ్‌ పంత్‌ బయటికి వస్తున్నాడంటూ ప్రముఖ జాతీయ పత్రిక దైనిక్‌ జాగరన్‌ పేర్కొంది. ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు జరిగే మెగా వేలానికి ముందే రిషభ్‌ పంత్‌.. ఢిల్లీని వీడనున్నట్లు సమాచారం.

చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న పంత్‌.. ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్‌ 2023కు దూరమైన పంత్‌.. ఐపీఎల్‌ 2024తో తిరిగి వచ్చాడు. యాక్సిడెంట్‌ తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే టీమిండియాలోకి కూడా వచ్చేశాడు. అయితే.. ఐపీఎల్‌ 2025కి పూర్తి కొత్త టీమ్‌తో బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌ను కూడా రిటేన్‌ చేసుకుంటారా? రిలీజ్‌ చేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు.

కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ.. రిషభ్‌ పంత్‌ ఢిల్లీ టీమ్‌లో ఉండాలని, అతనే కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా.. పంత్‌ మాత్రం అక్కడి నుంచి బయటికి వచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రిషభ్‌ పంత్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ధోని తర్వాత.. సీఎస్‌కే ఇండియన్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ఉండాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ కోరుకుంటుంది. అందుకు పంత్‌ అయితే సరైన ఆప్షన్‌ అని వాళ్లు ఫిక్స్‌ అయినట్లు సమాచారం. పైగా పంత్‌కు ధోనికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ధోని ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయినా.. సీఎస్‌కేలో మెంటర్‌గా కొనసాగే అవకాశం ఉంది. అందుకే పంత్‌ను తమ టీమ్‌లోకి తీసుకొని రావాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ పట్టుదలతో ఉంది. మరి పంత్‌ ఢిల్లీ వదిలి సీఎస్‌కే మారితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments