Rishabh Pant: IPL 2024కు ముందు రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్!

Rishabh Pant: IPL 2024కు ముందు రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్!

  • Author Soma Sekhar Published - 05:58 PM, Wed - 6 December 23

రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 05:58 PM, Wed - 6 December 23

రిషబ్ పంత్.. క్రికెట్ కు దూరం అయ్యి ఏడాది కావొస్తుంది. గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదానికి గురై.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 సీజన్ లోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఇందుకోసం జిమ్ లో కసరత్తులు కూడా ప్రారంభించాడు. ఆ వీడియోను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉన్నాడు పంత్. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పంత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్.. తొలుత ఐపీఎల్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఈ సీజన్ లో నడిపించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించేందుకు సిద్దమవుతున్నాడు. పంత్ ను ఢిల్లీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడంతో.. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కత్తాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్ లో కూడా చేరాడు. కానీ ట్రైనింగ్ సెషన్లకు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాడు. అయితే జిమ్ లో ఫిట్ నెస్ కు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ.. ఆ వీడియోను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నాడు.

తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు రిషబ్ పంత్. “పరిస్థితులు ఎలా ఉన్నా.. వాటిని మీరు నవ్వుతూ అంగీకరించండి” అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. కఠిన పరిస్థితుల నుంచి కోలుకున్న పంత్ పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నాడు. జిమ్ లో బరువుతు ఎత్తుతూ.. పుష్ అప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి..’బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్రీ పుషప్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇదిలా ఉండగా.. పంత్ ను ఢిల్లీ రిటైచేసుకున్న తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం చెన్నైసూపర్ కింగ్స్ పంత్ ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. మరి పంత్ రీఎంట్రీ కోసం శ్రమిస్తున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments