SNP
Rishabh Pant, KKR vs DC, IPL 2024: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ భారీ షాక్ తగలనుంది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై నిషేధం పడే ప్రమాదం కనిపిస్తోంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..
Rishabh Pant, KKR vs DC, IPL 2024: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ భారీ షాక్ తగలనుంది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై నిషేధం పడే ప్రమాదం కనిపిస్తోంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు డీసీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై డీసీ బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఏకంగా 272 పరుగుల భారీ స్కోర్ చేసింది కేకేఆర్. 273 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 166 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్ రిషభ్ పంత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 55 రన్స్‌తో అదరగొట్టినా.. మిగతా బ్యాటర్లు రాణించకపోవడం, లక్ష్యం మరీ పెద్దది అయిపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. తాను బాగా ఆడినా.. మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉన్నా పంత్‌కు బీసీసీఐ మరో షాకిచ్చింది.
ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసే జట్టు కెప్టెన్‌కు ఫైన్ వేస్తారనే విషయం తెలిసిందే. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో.. డీసీ కెప్టెన్‌గా ఉన్న పంత్‌పై ఐపీఎల్ కమిటీ రూ.24 లక్షల ఫైన్ విధించింది. పంత్‌తో పాటు.. టీమ్‌లోని సభ్యులందరిపై ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను కలుపుకుని తలా రూ.6 లక్షల జరిమానా విధించారు. అయితే.. ఇది పంత్‌కు రెండో జరిమానా.. కేకేఆర్‌తో మ్యాచ్ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేసింది.
ఆ సమయంలో పంత్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు. ఇప్పుడు రెండో సారి కూడా నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో రిషభ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో భారీ ఫైన్ పడింది. ఇప్పటికే రెండోసార్లు ఫైన్ పడటంతో మూడో సారి స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే.. పంత్‌కు రూ.30 లక్షల ఫైన్‌తో పాటు ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక వేళ మరో మ్యాచ్‌లో కూడా స్టో ఓవర్‌రేట్ నమోదు అయితే.. పంత్ ఒక మ్యాచ్‌కు దూరం అయ్యే డేంజర్‌లో ఉన్నాడు. కాగా, ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డీసీ.. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో కనీసం ఒక్కటైన స్టో ఓవర్‌రేట్ నమోదు అవుతుందని క్రికెట్ పండితులు అంటున్నారు. దీంతో పంత్‌పై నిషేధం తప్పేలా లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The third penalty will result in a one-match ban and a fine of 30 lakhs for Rishabh Pant. pic.twitter.com/DmTAsyar7b
— CricTracker (@Cricketracker) April 4, 2024