Richard Kettleborough: ఇండియాపై బురద చల్లే ప్రయత్నం! సరిగ్గా బుద్ధి చెప్పిన అంపైర్‌ కెటిల్‌బరో

Richard Kettleborough, Farid Khan, IND vs ENG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు సంబంధించి ఓ పాక్‌ అభిమాని చేసిన ఫేక్‌ ప్రచారాన్ని.. అంపైర్‌ కెటిల్‌బరో తిప్పికొట్టాడు. ఇండియాకు మద్దతుగా అతను స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Richard Kettleborough, Farid Khan, IND vs ENG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు సంబంధించి ఓ పాక్‌ అభిమాని చేసిన ఫేక్‌ ప్రచారాన్ని.. అంపైర్‌ కెటిల్‌బరో తిప్పికొట్టాడు. ఇండియాకు మద్దతుగా అతను స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య ఈ రోజు(గురువారం) గయానా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. గయానాలో మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడే సూచనలు ఉన్నాయని ఇప్పటికే పలు వెదర్‌ రిపోర్టులు వచ్చాయి. ఒక వేళ వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అయితే ఏంటి పరిస్థితి అనే అనుమానాలు కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే.. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగే సెమీ ఫైనల్‌కు రిజర్వ్‌ డే కూడా కేటాయించలేదు. కాకపోతే.. మ్యాచ్‌కు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. అప్పటికే వర్షం తగ్గకుండా మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేకుంటే.. సూపర్‌ 8లో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఇండియా ఫైనల్‌కు వెళ్తుంది.

ఇప్పుడు ఈ అంశంపై తన కుళ్లును వెళ్లగక్కుతున్నారు పాకిస్థాన్‌ అభిమానులు. చెత్త ఆటతో తమ టీమ్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాట పట్టిందనే బాధను కప్పిపుచ్చుకోవడానికి.. టీమిండియాపై ఫేక్‌ ప్రచారం చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా ఓ పాకిస్థాన్‌ అభిమాని.. ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్ట్‌ చేస్తూ గయానాలో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. అయినా కూడా గ్రౌండ్‌ను ఫుల్లుగా కవర్లలో ఎందుకు కప్పలేదు.. ఒక వేళ మ్యాచ్‌ రద్దు అయితే.. టీమిండియా ఈజీగా ఫైనల్‌కు వెళ్లాలని కావాలనే ఇలా చేస్తున్నారంటూ పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌పై ప్రముఖ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో చాలా హార్డ్‌గా స్పందించాడు. ‘ఇలాంటి ఫూల్స్‌కు గయానాలో ఇప్పటి ఫొటోలు పోస్ట్‌ చేయమని చెప్పంది.. పాత వెస్టిండీస్‌ సిరీస్‌కు సంబంధించిన ఫొటోలు కాదు’ అంటూ ఘాటుగా స్పందించాడు. పాత ఫొటోలు షేర్‌ చేస్తూ.. బీసీసీఐ క్రికెట్‌ను కంట్రోల్‌ చేస్తోంది, టీమిండియా చీటింగ్‌ చేసి గెలుస్తుంది అనే విషయాలను ప్రచారం చేయడానికి అతను చేసిన ప్రయత్నాన్ని కెటిల్‌బరో తిప్పికొట్టారు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో మనకు బ్యాడ్‌లక్‌గా భావించే అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో.. ఈ విషయంలో టీమిండియాకు సపోర్ట్‌ చేయడంతో.. భారత క్రికెట్‌ అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments