హార్ధిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌ పోవడానికి కారణం గంభీర్‌ కాదా? అసలు నిజం ఇదేనా?

Hardik Pandya, Vice Captain, IND vs SL, Gautam Gambhir: రోహిత్‌ శర్మ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్‌ అవుతాడనుకున్న హార్ధిక్‌పాండ్యా కనీసం వైస్‌ కెప్టెన్‌గా కూడా ఉండలేకపోయాడు. బీసీసీఐ అతన్ని వైస్‌ కెప్టెన్‌గా కూడా తప్పించింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Vice Captain, IND vs SL, Gautam Gambhir: రోహిత్‌ శర్మ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్‌ అవుతాడనుకున్న హార్ధిక్‌పాండ్యా కనీసం వైస్‌ కెప్టెన్‌గా కూడా ఉండలేకపోయాడు. బీసీసీఐ అతన్ని వైస్‌ కెప్టెన్‌గా కూడా తప్పించింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బకు తల్లడిల్లుతున్న హార్ధిక​్‌ పాండ్యాకు తాజాగా బీసీసీఐ కూడా ఊహించని షాక్‌ ఇచ్చింది. పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ పడింది. భార్య నటాషాతో విడాకులతో వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హార్ధిక్‌.. తాజాగా టీమిండియా వైస్‌ కెప్టెన్సీ కూడా పోగొట్టుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ అవసరం ఏర్పడింది. జింబాబ్వే టూర్‌కు శుబ్‌మన్‌ గిల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. కానీ, శ్రీలంక టూర్‌తో టీ20లకు పర్మినెంట్‌ కెప్టెన్‌తో పాటు మూడు ఫార్మాట్లకు కొత్త వైస్‌ కెప్టెన్‌ను కూడా నియమించింది.

నిజానికి రోహిత్‌ శర్మ తర్వాత.. టీ20లకు హార్ధిక్‌ పాండ్యానే కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. సరే కెప్టెన్సీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కానీ, వైస్‌ కెప్టెన్సీ కూడా ఉంచలేదు. ఆ పోస్టు నుంచి కూడా పీకేస్తూ.. శుబ్‌మన్‌ గిల్‌ను టీ20లకే కాకుండా వన్డేలకు కూడా వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. అయితే.. హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం, ఉన్న వైస్‌ కెప్టెన్సీ పోస్టును కూడా లాగేసుకోవడం వెనుక కొత్త కోచ్‌ గంభీర్‌ హస్తం ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో గంభీర్‌ హస్తం ఎంత మాత్రం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. టీమిండియాను చాలా కాలంగా ముంబైకి చెందిన వారే శాసిస్తున్నారు. ముంబై ఆటగాళ్లను పూర్తిగా డామినేట్‌ చేస్తే తప్పు గంగూలీ, ధోని, కోహ్లీ లాంటి ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్లుగా ఎక్కువ కాలం కొనసాగే వీలుండేది కాదు. ముంబై లాబీ భారత క్రికెట్‌ను అంత ప్రభావిం చేస్తోందని, ఇప్పుడు పాండ్యాకు కాకుండా ముంబైకి చెందిన సూర్యకుమార్‌ యాదవ్‌కు టీ20 కెప్టెన్సీ దక్కడంపై ముంబై లాబీ పనిచేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే హార్ధిక్‌ పాండ్యా యాటిట్యూడ్‌ కూడా అతను కెప్టెన్‌ అవ్వకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌ సమయంలో కెప్టెన్‌ షమీ లాంటి సీనియర్‌ ప్లేయర్లతో అతను ప్రవర్తించిన తీరు లాంటివి టీమిండియాలో జరిగితే కష్టమని బీసీసీఐ భయపడినట్లు సమాచారం. అందుకే పాండ్యాకు కెప్టెన్సీ దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments