జడేజాని బ్యాన్ చేయండి.. తెరపైకి వింత వాదన! అంత తప్పు చేశాడా?

Ravindra Jadeja: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని బ్యాన్‌ చేయాలని కూడా కొంతమంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

Ravindra Jadeja: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని బ్యాన్‌ చేయాలని కూడా కొంతమంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతం ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. 33 పరుగులకే 3 వికెట్లు పడిన క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి 200 పైచిలుకు పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. నిజానికి ఆ పార్ట్నర్‌షిపే మ్యాచ్‌లో టీమిండియాను నిలబెట్టింది. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లతో చెలరేగి.. ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. దీంతో అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా దక్కింది. ఇంత బాగా ఆడినా.. జడేజాను టీమిండియా నుంచి తీసేయాలని, అతనిపై నిషేధం విధించాలని ఒక వింత వాదన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అసలు ఈ వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జడేజా.. టీమిండియాలో కీలక ఆటగాడు. అలాగే అతని భార్య రివాబా జడేజా ఒక ఎమ్మెల్యే. గుజరాత్‌లోని నార్త్‌ జామ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందింది. క్రికెటర్‌గా జడేజా దేశ క్రీడా రంగంలో, ఎమ్మెల్యే భార్య ప్రజా సేవలో ఉన్నారు. కానీ, జడేజా తల్లిదండ్రులు మాత్రం జడేజాతో లేరు. ఇటీవల జడేజా తండ్రి అనిరుద్ధ్‌ సిన్హా జడేజా.. తన కుమారుడు, కొడలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు వచ్చినప్పటి నుంచి కొడుకు తమకు దూరమయ్యాడని, మా ఇంటికి వాడు, వాడింటికి మేము వెళ్లమని, కనీసం మమ్మల్ని చూసేందుకు కూడా జడేజా తమ ఇంటికి రాడని జడేజా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జడేజా కూడా స్పందించి, తాను కూడా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, కానీ, కుటుంబ విషయాలు ఇక్కడ అనవసరం అంటూ దాటవేశాడు. ఇదే విషయంపై జడేజా భార్య రివాబాను కొందరు జర్నలిస్టు ప్రశ్నిస్తూ.. తమ వ్యక్తిగత విషయాలు మీకెందుకంటూ మండిపడింది.

ఈ విషయంపైనే ఫ్యాన్స​ అంతా జడేజాపై గుర్రుగా ఉన్నారు. కన్న తల్లిదండ్రులను సరిగా చూడలేని వాడు. దేశం తరఫున ఆడుతూ.. యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. పైగా తన తండ్రి ఆరోపణలు చేసిన తర్వాత.. జడేజా తన భార్యకే మద్దుతగా నిలిచాడు. తన తండ్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, తన భార్య అలాంటిది కాదని వెనకేసుకొచ్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో తనకొచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును సైతం తన భార్యకే అంకితమిచ్చాడు. ఒక వైపు భార్య కారణంగా కన్న తల్లిదండ్రులకు దూరమైనా జడేజా.. ఇప్పుడు అవసరం లేకపోయినా.. తన భార్యను హైలెట్‌ చేయడానికి అవార్డును సైతం అంకితం ఇవ్వడంపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్దచేస్తే.. జడేజా ఈ స్థాయికి వచ్చాడని, ఇలా ఆర్థికంగా బలపడగానే వారిని గాలికొదిలేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో జడేజా ఎలాంటి పరిస్థితుల్లో ఉండే వాడే అతనికి తెలియదా? అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచి, ఇంతవాడిని చేస్తే.. ఇప్పుడు వాళ్లను కాదని భార్యకే వత్తాసు పలుకుతావా అంటూ మండిపడుతున్నారు. తల్లిదండ్రుల కష్టంలేనిదే ఈ రోజు టీమిండియాకు ఆడుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వింత వాదనను పక్కనపెడితే.. అసలు జడేజా కుటుంబంలో ఏం జరుగుతుందో? ఎవరికీ తెలియదు. తల్లిదండ్రులతో అతనెందుకు దూరంగా ఉంటున్నాడో ఎవరికీ కనీస అవగాహన లేదు. అలాంటప్పుడు జడేజాను తప్పుపట్టడం సరికాదు. ఎంత సెలబ్రెటీ అయినా కూడా తమ వ్యక్తిగత విషయాలను, కుటుంబ వ్యవహారాలను బయటపెట్టాల్సిన అవసరం లేదు. అదంతా పట్టించుకోకుండా జడేజాపై విషయం చిమ్మడం అర్థం లేని పని. ఇప్పటికైనా కొంతమంది సోకాల్డ్‌ నెటిజన్లు జడేజాపై చేస్తున్న విమర్శలను మానేస్తే మంచిదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments