ఢిల్లీని బెదరగొట్టిన అశ్విన్.. హేమా హేమీలకు కూడా సాధ్యం కాలేదు..

ఐపీఎల్ 2024లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు విజృంభిస్తున్నారు. ఢిల్లీ జట్టులో బ్యాటర్లు చెలరేగితే.. రాజస్థాన్ జట్టులో మాత్రం వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం స్పిన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు.

ఐపీఎల్ 2024లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు విజృంభిస్తున్నారు. ఢిల్లీ జట్టులో బ్యాటర్లు చెలరేగితే.. రాజస్థాన్ జట్టులో మాత్రం వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం స్పిన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు.

ఇండియన్ ప్రీమియల్ లీగ్ 2024లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ జట్టులో బ్యాటర్లు చెలరేగితే.. రాజస్థాన్ జట్టులో మాత్రం వెటరన్ అశ్విన్ మాత్రం స్పిన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను బెదరగొట్టేశాడు. అందరు బౌలర్లను వాళ్లు భయపెడితే వాళ్లని మాత్రం అశ్విన్ వణికించేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయిన మొదటి మూడు వికెట్లను కూడా రవిచంద్రన్ అశ్విన్ కే దక్కడం విశేషం. హేమా హేమీలకు కూడా కుదరనిది అశ్విన్ చేసి చూపించాడు.

రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు తొలుత కాస్త కంట్రోల్ తప్పినట్లే కనిపించింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మాత్రం విజృంభించారు. ఎక్కడా కూడా రాజస్థాన్ కు ఛాన్స్ లేకుండా పదునైన షాట్స్ తో చెలరేగిపోయారు. ముఖ్యంగా జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్(50), అభిషేక్ పోరెల్(65), అక్షర్ పటేల్(15) వికెట్లను అశ్విన్ తీసుకున్నాడు. రాజస్థాన్ జట్టులో ఉన్న బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్, చాహల్ వంటి బౌలర్లను ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అలవోకగా కొట్టేస్తుంటే.. అశ్విన్ మాత్రం అలాంటి డేంజరస్ బ్యాటర్లను ముప్ప తిప్పలు పెట్టేశాడు. షాయ్ హోప్ మాత్రం రనౌట్ కాగా.. మిగిలిన 3 వికెట్స్ దక్కించుకుని తన సత్తా ఏంటో చాటాడు.

ఈ మ్యాచ్ సమురీ చూస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి యువ సంచలనం జేక్ ఫ్రేజర్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అవేశ్ ఖాన్ ఓవర్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. అలాంటి జేక్ ఫ్రేజర్ ను అశ్విన్ తర్వాతి ఓవర్లో పెవిలియన్ కు చేర్చాడు. అలాగే ఈ మ్యాచ్ లో అభిషేక్ పోరెల్ కూడా విజృంభించాడు. ఏకంగా 65 పరుగులు చేసి అల్లాడించాడు. అలాంటి వాడిని కూడా అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్ లో కనిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. అలాంటి వాడిని కూడా అశ్విన్ పెవిలియన్ కు చేర్చి.. శభాష్ అనిపించాడు. ఈ టీమ్ లో ఉన్న దిగ్గజాలు, సీనియర్లు కూడా అశ్విన్ దెబ్బకు అవ్వాక్ అయ్యారు. హేమా హేమీలకు కూడా వికెట్స్ తీయడం సాధ్యం కాకపోతే.. అశ్విన్ మాత్రం తన సత్తా చాటాడు. మరి.. అశ్విన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments