iDreamPost
android-app
ios-app

నెట్స్‌లో అశ్విన్‌ భారీ సిక్సులు! హార్దిక్ పాండ్యా రియాక్షన్‌ వైరల్‌

  • Author Soma Sekhar Published - 01:45 PM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Published - 01:45 PM, Sat - 7 October 23
నెట్స్‌లో అశ్విన్‌ భారీ సిక్సులు! హార్దిక్ పాండ్యా రియాక్షన్‌ వైరల్‌

వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరిగే తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు కఠోర సాధన చేస్తున్నారు. నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నెట్స్ బ్యాటింగ్ చేస్తూ చెమట చిందిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అశ్విన్ బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ తో మ్యాచ్ కు ముందు అశ్విన్ నెట్స్ లో కొట్టిన భారీ సిక్స్ లను చూసి హార్దిక్ పాండ్యా షాక్ కు గురైయ్యాడు. అశ్విన్ షాట్స్ కు పాండ్యా ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా వరల్డ్ కప్ 2023లో చోటు దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో అశ్విన్ కు ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ స్టార్ స్పిన్నర్ ఇటు బౌలింగ్ తో పాటుగా అటు బ్యాటింగ్ పై కూడా దృష్టిపెట్టాడు. అందులో భాగంగానే కొన్ని రోజులుగా నెట్స్ లో తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆసీస్ తో జరిగే మ్యాచ్ కోసం నెట్స్ తో గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు అశ్విన్.

ఇక అతడు ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో అక్కడే ఉండి అశ్విన్ బ్యాటింగ్ ను కనిపెడుతున్నాడు పాండ్యా. ప్రాక్టీస్ లో భాగంగా అశ్విన్ భారీ సిక్సులు కొట్టడం చూసి పాండ్యా ఆశ్చర్యపోయాడు. అశ్విన్ కొట్టే సిక్స్ లకు పాండ్యా ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం పాండ్యా ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా.. గత కొంతకాలంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అశ్విన్ ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలకంగా మారుతాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెట్స్ లో గాయపడ్డ పాండ్యా తిరిగి ప్రాక్టీస్ మెుదలుపెట్టడం టీమిండియాకు శుభసూచకమనే చెప్పాలి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet