గత కొన్ని రోజులుగా టీమిండియా వరల్డ్ కప్ జట్టులో మార్పు జరగబోతోంది అన్న వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీకి తొలుత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకుంది సెలక్షన్ కమిటీ. అయితే గాయం కారణంగా అక్షర్ ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. దీంతో అతడు వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న అనుమానం తలెత్తింది. ఆ అనుమానం కాస్త నిజమైంది. అతడు పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడి స్థానంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ను తీసుకుంది.
టీమిండియా వరల్డ్ కప్ జట్టులో మార్పు జరిగింది. తాజాగా రోహిత్ శర్మ సైతం వరల్డ్ కప్ జట్టులో మార్పు జరగబోతోంది అన్న హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హింట్ కాస్త నిజమైంది. గాయంతో బాధపడుతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్షర్ జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో అదృష్టం కలిసొచ్చి అశ్విన్ వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడనే చెప్పాలి. కాగా.. అశ్విన్ గురించి తాజాగా టీమిండియా సారథి రోహిత్ శర్మ పాజిటివ్ గా మాట్లాడిన విషయం తెలిసిందే. అశ్విన్ సీనియర్ బౌలర్ అని, అతడికి ఒత్తిడి ఎలా అధిగమించాలో తెలుసని, అతడి బౌలింగ్ లో వైవిద్యం ఉందని కితాబిచ్చాడు రోహిత్. మరి అశ్విన్ వరల్డ్ కప్ జట్టులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India World Cup 2023 squad:
Rohit (C), Gill, Kohli, Iyer, Rahul, Hardik, Jadeja, Ashwin, Kuldeep, Bumrah, Siraj, Shami, Thakur, Ishan, Surya. pic.twitter.com/lG9At37SYb
— Johns. (@CricCrazyJohns) September 28, 2023