గౌతం గంభీర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు గంభీర్. ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలసి ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడేవాడు. గంభీర్, వీరూ క్రీజులో ఉంటే ఇక బౌలర్ల పని అయిపోయినట్లే అనేలా పరిస్థితి ఉండేది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడాల్లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రన్స్ చేశాడు గంభీర్. సెహ్వాగ్‌తో కలసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్లు అందించాడు. క్వాలిటీ స్పిన్నర్లతో పాటు వరల్డ్ క్లాస్ పేసర్ల బౌలింగ్‌లోనూ క్రీజును వదిలి ముందుకొచ్చి ఎటాక్ చేయడం గంభీర్ స్టైల్.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా గెలుచుకోవడంలో గంభీర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. 12 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో 58 టెస్టులు (4,154 రన్స్), 147 వన్డేలు (5,238), 37 టీ20లు (932 రన్స్) ఆడాడు గంభీర్. అన్ని ఫార్మాట్లలోనూ అతడి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండేదో చేసిన పరుగుల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో గంభీర్ (97 రన్స్) ఇన్నింగ్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే భారత్ తరఫున ఇంత బాగా ఆడినా ఎందుకో అతడికి రావాల్సినంత పేరు, గుర్తింపు దక్కలేదని విశ్లేషకులు అంటుంటారు.
పర్సనల్ రికార్డుల కోసం కాకుండా జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడిన గంభీర్‌కు సాటి స్టార్ ప్లేయర్ల స్థాయిలో క్రెడిట్ దక్కలేదనేది వాస్తవం. దీంతో ఏకీభవించాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గంభీర్ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘మన దేశంలో అందరూ గంభీర్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అతడు జట్టు కోసం పోరాడే గ్రేట్ క్రికెటర్. అతడికి రావాల్సిన దాని కంటే తక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం పరితపించకుండా టీమ్ కోసం గంభీర్ ఆడాడు’ అని ఒక యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి.. గంభీర్ స్వార్థం లేని క్రికెటర్ అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!