iDreamPost

కివీస్​తో మ్యాచ్​కు ముందు ఇంగ్లండ్​కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!

  • Author singhj Published - 10:12 PM, Wed - 4 October 23
  • Author singhj Published - 10:12 PM, Wed - 4 October 23
కివీస్​తో మ్యాచ్​కు ముందు ఇంగ్లండ్​కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!

వన్డే వరల్డ్ కప్​-2023 ఆరంభానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. భారత్​ ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఇంకా వెయిటింగ్ అవసరం లేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం జరిగే మొదటి మ్యాచ్​తో ప్రపంచ కప్ మొదలు కానుంది. 2019లో సొంతగడ్డ మీద జరిగిన వరల్డ్ కప్​ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ జట్టు ఖాతాలో అదే తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. ఆ టోర్నమెంట్ ఫైనల్​లో న్యూజిలాండ్​ను ఓడించి ఛాంపియన్​గా అవతరించింది ఇంగ్లండ్. హోరాహోరీగా సాగిన ఆ ఫైనల్​లో ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి.

ఇంగ్లండ్-న్యూజిలాండ్​ మధ్య జరిగిన 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టై అయింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. కానీ అక్కడా ఫలితం తేలలేదు. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు బౌండరీ కౌంట్ ఆప్షన్​ను ఎంచుకున్నారు. దీంతో బౌండరీలు ఎక్కువ కొట్టిన ఇంగ్లండ్ ఛాంపియన్​గా అవతరించింది. విజయానికి చేరువ దాకా వచ్చి కివీస్ తృటిలో కప్పును చేజార్చుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫ్యాన్స్​ కన్నీళ్లను ఆపులేకపోయారు. తొలిసారి వరల్డ్ కప్ గెలవడంతో ఇంగ్లండ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక, భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రస్తుత వరల్డ్ కప్​లో ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్​కు తొలి మ్యాచ్​కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019 వరల్డ్ కప్​ హీరో బెన్ స్టోక్స్ న్యూజిలాండ్​తో ఫస్ట్ మ్యాచ్​లో బరిలోకి దిగడం అనుమానంగా మారింది.

ఫిట్​నెస్​ సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్ మొదటి మ్యాచ్ ఆడటం మీద సందేహాలున్నాయని ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెప్పాడు. తొంటి నొప్పితో బాధపడుతున్న స్టోక్స్ ఫిజియోల పర్యవేక్షణలో పూర్తి ఫిట్​నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడని బట్లర్ తెలిపాడు. ట్రైనింగ్ సెషన్ తర్వాతే స్టోక్స్​ను ఆడించాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతామని పేర్కొన్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోబోమని.. స్టోక్స్ పూర్తిగా కోలుకునే దాకా ఆడించబోమన్నాడు. ఒకవేళ కివీస్​తో జరిగే మ్యాచ్​కు స్టోక్స్ దూరమైతే ఇంగ్లండ్​కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రాణించే కీలక ప్లేయర్ అయిన స్టోక్స్ గైర్హాజరీ ఆ టీమ్ కూర్పును దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవేళ స్టోక్స్ ఆడకపోతే అతడి ప్లేసులో హ్యారీ బ్రూక్ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో సత్తా చాటిన నీరజ్ చోప్రా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి