IPLలో RTM రూల్‌ వల్ల ఆటగాళ్లకు తీవ్ర అన్యాయంతో పాటు రెస్పెక్ట్‌ ఉండదు: అశ్విన్‌

Ravichandran Ashwin, RTM, IPL 2024: ఐపీఎల్‌ 2025 సీజన్‌కి ముందు జరిగే మెగా వేలంలో ప్రవేశపెట్టబోతున్న ఓ రూల్‌పై టీమిండియా క్రికెటర్‌ రవిచం‍ద్రన్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ రూల్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ravichandran Ashwin, RTM, IPL 2024: ఐపీఎల్‌ 2025 సీజన్‌కి ముందు జరిగే మెగా వేలంలో ప్రవేశపెట్టబోతున్న ఓ రూల్‌పై టీమిండియా క్రికెటర్‌ రవిచం‍ద్రన్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ రూల్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఏదైన విషయంపై నిర్మోహమాటంగా, నిర్భయంగా మాటలే క్రికెటర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకడు. అందుకే అతను ఏదైన చెప్తే అందులో కచ్చితంగా విషయం ఉంటుందని క్రికెట్‌ అభిమానులు నమ్ముతారు. తాజాగా అశ్విన్‌ ఓ ఐపీఎల్‌ రూల్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు.. ఇటీవలె బీసీసీఐ పెద్దలు అన్ని ఐపీఎల్‌ జట్ల యజమానులతో సమావేశం అయ్యారు. ఇందులో కొన్ని విషయాలపై చర్చించారు. ఆటగాళ్ల రిటెన్షన్‌ విధానం, రిటేన్‌ చేసుకునే ఆటగాళ్ల పరిమితి, అలాగే ఆర్టీఎం(రైట్‌ టూ మ్యాచ్‌) విధానాలపై చర్చించారు.

ఆర్‌టీఎంతో ఫ్రాంచైజీలకు మంచి జరుగుతుంది.. కానీ, ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగడమే కాకుండా వారి నిర్ణయానికి రెస్పెక్ట్‌ లేకుండా పోతుందని అన్నాడు. మెగా వేలానికి జరిగిన మీటింగ్‌లో 6,7 ఆటగాళ్లను రిటేన్‌ చేసుకునే అవకాశం కల్పించాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి టీమ్స్‌ కోరాయి. బీసీసీఐ కూడా దీనికి దాదాపు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఆర్‌టీఎంతో వేలం తర్వాత కూడా తమ టీమ్‌కు ఇంత ముందు ఆడిన ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. పైగా ప్రతి జట్టు ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల వరకు ఆర్‌టీఎం ద్వారా తిరిగి తమ టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

ఆర్‌టీఎం అంటే ఏంటి?

ఆర్‌టీఎం(రైట్‌ టూ మ్యాచ్‌) అంటే.. గత సీజన్‌లో టీమ్‌లో ఆడి.. వేలానికి వస్తే.. ఆ ఆటగాడిని వేలంలో అమ్ముడుపోయే ధరను ఇస్తే తిరిగి పాత టీమ్‌ దక్కించుకోవచ్చు. ఆర్‌టీఎం కార్డ్‌తో ఏ ఐపీఎల్‌ టీమ్‌ అయినా ఈ రూల్‌ను వాడుకోవచ్చు. ఉదాహరణకు రోహిత్‌ శర్మను ఐపీఎల్‌ 2025 కోసం రిటేన్‌ చేసుకోకుంటే.. అతను వేలంలో పాల్గొంటాడు. రోహిత్‌ కోసం రెండు, మూడు ఫ్రాంచైజీలు పోటీపడి.. చివరికి ఓ ఫ్రాంచైజ్‌ రూ.10 కోట్లకు ఫైనల్‌ బిడ్‌ వేసిన తర్వాత.. ముంబై ఇండియన్స్‌ ఆర్‌టీఎం కార్డు వాడి.. ఆ రూ.10 కోట్ల ఇచ్చి రోహిత్‌ను తిరిగి తమ టీమ్‌లోకి తెచ్చుకోవచ్చు.

ఈ రూల్‌తో ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని అశ్విన్‌ అంటున్నాడు. అది ఎలాగంటే.. ఐపీఎల్‌ 2024 కోసం రోహిత్‌కు ముంబై ఇండియన్స్‌ రూ.16 కోట్లు చెల్లించింది. ఒక వేల అతను టీమ్‌లో అవసరం లేదని వదులుకుంటే.. రోహిత్‌ రూ.2 కోట్ల బేస్‌ ప్రైజ్‌తో వేలంలో ఉంటాడు. అతన్ని సీఎస్‌కేనో, ఎస్‌ఆర్‌హ్‌చో పోటీ పడి.. ఓ రూ.10 కోట్లకు దక్కించుకుంటే.. వెంటనే ముంబై ఆర్‌టీఎం కార్డు వాడి అదే రూ.10 కోట్లకు రోహిత్‌ను మళ్లీ టీమ్‌లోకి తీసుకోవచ్చు. ఆర్‌టీఎం కార్డు వల్ల ఒక్క ముంబై ఇండియన్స్‌కు రూ.6 కోట్లు మిగిలినట్లే. ఎందుకంటే రోహిత్‌ను రిటేన్‌ చేసుకుని ఉంటే రూ.16 కోట్లు చెల్లించాల్సి వచ్చేంది. ఒక వేళ రోహిత్‌ రూ.16 కోట్ల కంటే ఎక్కువ పలికి ఉంటే.. ఎలాగో వద్దనుకుని జట్టు నుంచి రిలీజ్‌ చేశారు కాబట్టి.. రోహిత్‌ను తీసుకునేందుకు ఇష్టపడరు. ఇలా ఈ రూల్‌తో ఆటగాళ్లకే నష్టజరుగుతుందని అశ్విన్‌ అంటున్నాడు.

ఇక ఒక టీమ్‌ నుంచి వద్దనుకుని వెళ్లిపోయి.. వేలంలో పాల్గొంటే.. అతన్ని వేరే టీమ్‌ కొనుగోలు చేసినప్పటికీ పాత టీమ్‌ ఆర్‌టీఎం కార్డు వాడు అతన్ని తిరిగి టీమ్‌లోకి తెచ్చుకోవచ్చు. ఐపీఎల్‌ 2024లో రోహిత్‌ శర్మకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పించి.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది. అది రోహిత్‌కు నచ్చలేదు. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చేద్దామని అనుకుని.. రిటెన్షన్‌కు ఒప్పుకోకుండా వేలంలో పాల్గొన్నాడు. వేలంలో రోహిత్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది.. కానీ, ముంబై ఇండియన్స్‌ ఆర్‌టీఎం కార్డు వాడి రోహిత్‌ను ఎంఐలోకి తీసుకోవచ్చు. ఇలా చేస్తే.. ఇక రోహిత్‌ శర్మ నిర్ణయానికి విలువ ఎక్కడుంటుంది. డబ్బుతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు ఇష్టలేకపోయినా బలవంతంగా ఆడిస్తాయి. లేదంటే.. లీగ్‌కు దూరంగా ఉండాలి. అందుకే ఈ ఆర్‌టీఎం రూల్‌తో ఆటగాళ్లకు అన్యాయంతో పాటు విలువ లేకుండా పోతుందని అశ్విన్‌ మొత్తుకుంటున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments