SNP
SNP
నేటి నుంచి క్రికెట్ పండుగ మొదలు కానుంది. క్రికెట్ అభిమానులకు నెలన్నర పాటు అసలు సిసలైన వన్డే క్రికెట్ మజాను అందించేందుకు వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, 2019 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మహా సంగ్రామానికి తెరలేవనుంది. అయితే.. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్, 2011లో భారత్‌కు వరల్డ్ కప్ అందించిన మహేంద్రసింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్ తొలుత వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో.. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కు చివరి క్షణాల్లో వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కింది. ఆసియా కప్ 2023లో ఆడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్, అశ్విన్‌లను ఆప్షన్‌గా తీసుకుని.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో పరీక్షించి.. ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా అశ్విన్‌ను వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. అయితే.. వరల్డ్ కప్ టీమ్‌లోకి రాకముందు.. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లేతో కుట్టి స్టోరీస్ పేరుతో చిన్న చిట్‌చాట్ చేశాడు.
ఈ కుట్టీ స్టోరీస్‌లో భాగంగా.. ధోని గురించి మాట్లాడిన అశ్విన్. ధోని కెప్టెన్ కాదని, వాస్తవానికి అతనో డైరెక్ట్ అంటూ పేర్కొన్నాడు. ఒక డైరెక్టర్ ఒక పాత్రను అద్భుతంగా సృష్టిస్తాడని, ఆ క్యారెక్టర్ సినిమాలో ఎక్కడ సెట్ అవుతుందో ఆ డైరెక్టర్‌కు బాగా తెలుస్తుందని, అలాగే ధోని కూడా ఏ ఆటగాడు ఏ సిచ్యూవేషన్‌లో సెట్ అవుతాడో అతన్ని సరిగ్గా అక్కడే ప్లేస్ చేస్తాడని చెప్పాడు. అందువల్లే ధోని అంత సక్సెస్ అయ్యాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం అశ్విన్ ధోని గురించి చేసిన ఈ పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి అశ్విన్ స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయానలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravichandran Ashwin talking about the Captain MS Dhoni.
– The GOAT Captain.pic.twitter.com/mvkXCzVn9c
— Johns. (@CricCrazyJohns) October 4, 2023
ఇదీ చదవండి: కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్.. బవుమా చేసిన పనికి అంతా షాక్!