వీడియో: ఇలాంటి క్యాచ్‌ను మీ లైఫ్‌లో చూసుండరు! IPLలోనే బెస్ట్‌ క్యాచ్‌!

Ramandeep Singh, KKR vs LSG, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్యాచ్‌ నమోదు అయింది. ఈ క్యాచ్‌ చూస్తూ.. ఎవరైనా వావ్‌ అనాల్సిందే. అలాంటి క్యాచ్‌ను పట్టింది ఎవరో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ramandeep Singh, KKR vs LSG, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్యాచ్‌ నమోదు అయింది. ఈ క్యాచ్‌ చూస్తూ.. ఎవరైనా వావ్‌ అనాల్సిందే. అలాంటి క్యాచ్‌ను పట్టింది ఎవరో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ చరిత్రలోనే బెస్ట్‌ క్యాచ్‌ నమోదు అయిందని క్రికెట్‌ అభిమానులే కాదు క్రికెట్‌ నిపుణులు కూడా ఓ క్యాచ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గాల్లోకి లేచిన బంతిని వెనక్కి పరిగెడుతూ.. అమాంతం గాల్లోకి సూపర్‌ మ్యాన్‌లా దూకి మరీ పట్టిన క్యాచ్‌ అది. ఆ మాత్రం మెచ్చుకోవడంలో తప్పులేదు. ఇంతకీ ఈ క్యాచ్‌ పట్టింది ఎవరు? ఏ మ్యాచ్‌లో ఈ క్యాచ్‌ చోటు చేసుకుంది లాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా అద్భుతమైన పవర్‌ హిట్టింగ్‌తో 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఎందుకంటే.. కేకేఆర్‌ బౌలింగ్‌ ఆ రేంజ్‌లో చేసింది.

ఒక్క బౌలింగ్‌ అనే కాదు.. వారి ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా ఉంది. బౌలర్లకు తమ సూపర్‌ ఫీల్డింగ్‌తో కేకేఆర్‌ ప్లేయర్‌ ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చారో చెప్పడానికి ఈ ఒక్క క్యాచ్‌ చాలు. 236 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నోకు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, అర్షిన్‌ కులకర్ణి మంచి స్టార్‌ ఇచ్చారు. 1.5 ఓవర్స్‌లోనే 20 పరుగులు చేసి.. కావాల్సిన వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అదే వేగంతో మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ చివరి బంతికి కులకర్ణి భారీ షాట్‌ ఆడే క్రమంలో మిస్‌ టైమ్‌ చేశాడు. దాంతో బాల్‌ గాల్లోకి చాలా ఎత్తుకి వెళ్లింది. ఆ బంతిని వెనక్కి పరిగెడుతూ.. కేకేఆర్‌ ఫీల్డర్‌ రమన్‌దీప్‌ సింగ్‌ ఒక సూపర్‌ క్యాచ్‌ పట్టాడు. రమన్‌దీప్‌ పట్టిన క్యాచ్‌ చూసి.. అక్కడే ఉన్న ఆండ్రీ రస్సెల్‌ సైతం ఆశ్చర్యపోయాడు. కేకేఆర్‌ ఆటగాళ్లతో పాటు లక్నో బ్యాటర్లు కూడా ఆ క్యాచ్‌ చూసి కళ్లుతేలేశారు. ప్రముఖ కామెంటేటర్‌ రవిశాస్త్రి ఆ క్యాచ్‌ను బెస్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌గా అభిర్ణించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు సాల్ట్‌ 32, సునీల్‌ నరైన్‌ 81 పరుగులతో రాణించి.. మరో సారి మంచి స్టార్ట్‌ అందించాడు. నరైన్‌ అయితే విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సులతో రెచ్చిపోయి ఆడాడు. అలాగే రఘువంశీ 32, శ్రేయస్‌ అయ్యర్‌ 23, రమన్‌దీప్‌ సింగ్‌ 6 బంతుల్లో 25 రన్స్‌ చేసి కేకేఆర్‌ భారీ స్కోర్‌ చేయడంలో సాయపడ్డారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక 236 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగి ఎల్‌ఎస్‌జీ 16.1 ఓవర్లలో కేవలం 137 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 25, స్టోయినీస్‌ 36 రన్స్‌తో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో లక్నో చిత్తుగా ఓడిపోయింది. కేకేఆర్‌ బౌలర్లలో హర్షిత్‌ రాణా, వరణ్‌ చక్రవర్తి మూడేసి వికెట్లతో అదరగొట్టారు. ఆండ్రీ రస్సెల్‌ 2, స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో రమన్‌ దీప్‌ సింగ్‌ పట్టిన సెన్సెషనల్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments