Rajat Patidar: చెన్నై ప్లేయర్‌ కారణంగా లక్షల్లో నష్టపోయిన RCB

ఐపీఎల్‌లో రెండు టాప్‌ టీమ్స్‌ చెన్నై, ఆర్సీబీ. అయితే.. ఇప్పుడు ఓ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ కారణంగా ఆర్సీబీకి ఏకంగా లక్షల్లో నష్టం వాటిల్లింది. అదెలానో? అందుకు ఎవరు కారణం అయ్యారో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో రెండు టాప్‌ టీమ్స్‌ చెన్నై, ఆర్సీబీ. అయితే.. ఇప్పుడు ఓ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ కారణంగా ఆర్సీబీకి ఏకంగా లక్షల్లో నష్టం వాటిల్లింది. అదెలానో? అందుకు ఎవరు కారణం అయ్యారో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా ఉంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. అలాగే టైటిల్స్‌ గెలవకపోయినా.. భారీ ఫ్యాన్‌ బేస్‌తో ఐపీఎల్‌లో నంబర్‌ వన్‌ టీమ్‌గా ఉంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. అయితే.. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన స్టార్‌ ప్లేయర్‌ కారణంగా ఆర్సీబీకి ఏకంగా రూ.30 లక్షలు నష్టం జరిగింది. అదేలా అని అనుకుంటున్నారా? అయితే పూర్తి స్టోరీ చదవండి. టీమిండియా యంగ్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. చెన్నై సూపర్‌ కింగ్స​ టీమ్‌లో కీ ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా సీఎస్‌కేలో గైక్వాడ్‌ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించాడు.

కానీ, దురదృష్టవశాత్తు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా రుతురాజ్‌ గాయపడ్డాడు. తొలి రెండు వన్డేలు ఆడిన గైక్వాడ్‌.. రెండో వన్డేలో చేతి వేలి గాయం కావడంతో మూడో వన్డేకు దూరం అయ్యాడు. దీంతో.. రుతురాజ్‌ స్థానంలో మరో యంగ్‌ ప్లేయర్‌ రజత్‌ పటీదార్‌ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. రుతురాజ్‌ గాయం పటీదార్‌కు కలిసొచ్చింది. గైక్వాడ్‌ లేకపోవడంతో.. అతని స్థానంలో ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లోకి పటీదార్‌ అరంగేట్రం చేశాడు. టీమిండియా జెర్సీ ధరించాలన్న కలను నేరవేర్చుకున్నాడు. అయితే.. పటీదార్‌ సైతం ఐపీఎల్‌లో రాణించి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తుండటంతో అతనికి టీమిండియా జట్టులో స్థానం దక్కింది.

అయితే.. ఇక్కడే ఆర్సీబీకి రూ.30 లక్షలు నష్టం తెచ్చిపెట్టే పని జరిగింది. పటీదార్‌ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. అతని బేస్‌ ప్రైజ్‌ రూ.20 లక్షలకే దక్కించుకున్న ఆర్సీబీ.. పటీదార్‌ సేవలను పొందుతోంది. కానీ, ఇప్పుడు పటీదార్‌ టీమిండియా తరఫుర అరంగేట్రం చేయడంతో.. అతని బేస్‌ ప్రైజ్‌ రూ.50 లక్షలకు పెరిగింది. ఏ ఆటగాడైన సరై టీమిండియా తరఫున ఆడితే.. అతనికి కనీస ధర కింద రూ.50 లక్షలు చెల్లించాల్సిందే. ఆ లెక్కన మొన్నటి వరకు పటీదార్‌కు రూ.20 లక్షలు చెల్లిస్తున్న ఆర్సీబీ.. రాబోయే సీజన్‌ నుంచి రూ.50 లక్షలు చెల్లించాల్సిందే. ఇలా రుతురాజ్‌ గాయం ఆర్సీబీకి రూ.30 లక్షల ఖర్చు పెంచింది. రుతురాజ్‌ గాయపడకుంటే.. పటీదార్‌కు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అలా.. గైక్వాడ్‌ గాయం పటీదార్‌కు డబుల్‌ ధమాకాలా పనిచేసింది. ఇటు టీమిండియా తరఫున ఆడే అవకాశంతో పాటు ఐపీఎల్‌ బేస్‌ ప్రైజ్‌ను పెంచేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments