వీడియో: రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు కొట్టిన భారీ సిక్స్‌ చూశారా?

Rahul Dravid, Samit Dravid, Maharaja Trophy 2024: టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు ఓ భారీ సిక్స్‌తో అడరగొట్టాడు. అది చూస్తూ.. వామ్మో ద్రవిడ్‌కి పూర్తి భిన్నంగా ఉన్నాడే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అతని సిక్స్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rahul Dravid, Samit Dravid, Maharaja Trophy 2024: టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు ఓ భారీ సిక్స్‌తో అడరగొట్టాడు. అది చూస్తూ.. వామ్మో ద్రవిడ్‌కి పూర్తి భిన్నంగా ఉన్నాడే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అతని సిక్స్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు. అలాగే అవసరమైన సమయంలో జిడ్డు బ్యాటింగ్‌తో ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన సాలిడ్‌ డిఫెన్స్‌తో రక్షించేవాడు. అందుకే ద్రవిడ్‌ను ముద్దుగా ‘ది వాల్‌’ అని పిలుస్తారు క్రికెట్‌ అభిమానులు. అయితే.. ద్రవిడ్‌ కొడుకు మాత్రం తండ్రికి పూర్తి భిన్నంగా ఊర మాస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

కర్ణాటకలో జరుగుతున్న మహరాజా ట్రోఫీ టీ20 2024 టోర్నీలో ఆడుతున్న రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ సూపర్‌ సిక్స్‌తో అదరగొట్టాడు. మైసూర్‌ వారియర్స్‌ తరఫున ఆడుతున్న సమిత్‌.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమిత్‌ జ్ఞానేశ్వర్‌ నవీన్‌ అనే బౌలర్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొడుకు.. తండ్రి లెక్క కాదు.. ఊర మాస్‌గా ఉన్నాడే అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

అలాగే అంతకు ముందు ఆగస్టు 15న నమ్మ శివమొగ్గ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమిత్‌ ద్రవిడ్‌ ఒక బౌండరీతో 7 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఈ టోర్నీ కోసం మైసూర్‌ వారియర్స్‌ సమిత్‌ ద్రవిడ్‌ను రూ.50 వేలకు కొనుగోలు చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఒక 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరు బ్లాస్టర్స్‌ 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో సమిత్‌ ద్రవిడ్‌ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments