వీడియో: కన్నీళ్లు పెట్టిస్తున్న హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ చివరి స్పీచ్‌!

Rahul Dravid, Team India, IND vs SA, T20 World Cup 2024: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో తన చివరి స్పీచ్‌ ఇచ్చాడు. ఆ మాటలు వింటే.. భారత క్రికెట్‌ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ద్రవిడ్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rahul Dravid, Team India, IND vs SA, T20 World Cup 2024: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో తన చివరి స్పీచ్‌ ఇచ్చాడు. ఆ మాటలు వింటే.. భారత క్రికెట్‌ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ద్రవిడ్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగిసింది. 2021 నవంబర్‌లో భారత హెడ్‌ కోచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. తన కోచింగ్‌లోనే టీమిండియాను 2022 టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌కి, 2023 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కి, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి తీసుకెళ్లాడు. కానీ, ఈ సారి చివరి మెట్టుపై ఆగకుండా.. టీ20 వరల్డ్ కప్‌ 2024 కైవసం చేసుకునేలా చేశాడు. ద్రవిడ్‌ కోచింగ్‌లో టీమిండియా అద్భుతమైన జట్టుగా ఎదిగింది. సీనియర్లతో పాటు జట్టులో జూనియర్లకు మంచి అవకాశాలు ఇస్తూ.. ఒక సూపర్‌ స్ట్రాంగ్‌ టీమ్‌గా ద్రవిడ్‌ తీర్చిదిద్దాడు.

అయితే.. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌తో హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ టైమ్‌ పిరియడ్‌ అయిపోయింది. హెడ్‌ కోచ్‌ పదవీకి వరల్డ్‌ కప్‌ విజయంతో వీడ్కోలు పలకనున్నాడు ది గ్రేట్‌ ద్రవిడ్‌. భారత్‌ జట్టు తన కోచింగ్‌లో వరల్డ్‌ కప్‌ సాధించడంతో ద్రవిడ్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. అదే సమయంలో కోచ్‌గా తప్పుకుంటూ జట్టుకు దూరం అవుతుండటంపై ద్రవిడ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా తన చివరి స్పీచ్‌ ఇచ్చాడు. ఆ స్పీచ్‌ వింటే.. భారత క్రికెట్‌ అభిమానులు కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం. ద్రవిడ్‌ మాట్లాడుతుంటే.. రోహిత్‌ శర్మతో పాటు భారత ఆటగాళ్లు కూడా ద్రవిడ్‌ మాటలకు ఎమోషనల్‌ అయ్యారు.

ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘నాకు మాటలు రావడం లేదు. ఈ మూమెంట్స్‌ మన జీవిత కాలం గుర్తుండి పోతాయి. మీరు ఎన్ని రన్స్‌ చేశారు, ఎన్ని వికెట్లు తీశారు మీ కెరీర్‌ అనేవి గుర్తుండవు కానీ, ఈ విన్నింగ్‌ మూమెంట్స్‌ గుర్తుండిపోతాయి. ఇంత గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరి థ్యాంక్యూ. ఎన్నో త్యాగాలు చేసి.. మీరంతా ఇంత దూరం వచ్చారు. మీ కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, తోబుట్టువులు, మీ కోచ్‌లు ఇలా ఎంతో మంది ఎంతో కొంత త్యాగం చేస్తేనే మీరు ఈ మూమెంట్స్‌ను ఈ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పొందుతున్నారు. నన్ను కూడా ఈ మూమెంట్స్‌లో భాగం చేసినందుకు ధన్యవాదాలు. నన్ను, నా టీమ్‌కు మద్దతుగా ఉంటూ మాకు సహకరిస్తూ, మమ్మల్ని గౌరవించినందుకు అందరికి థ్యాంక్స్‌.

నన్ను కొనసాగమని కోరినందుకు రోహిత్‌ శర్మకు థ్యాంక్యూ. నాకు తెలుసు కెప్టెన్‌గా, కోచ్‌గా మన మధ్య చాలా చర్చలు జరిగాయి.. చాలా సార్లు ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్తాం.. కొన్ని సార్లు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇదంతా సమిష్ఠి విజయం. ఏ ఒక్కరి వల్ల వచ్చిందో కాదు.. టీమ్‌ ఎఫర్ట్‌. గత నెల రోజులుగా ఒక టీమ్‌గా మనం పడుతున్న కష్టానికి ఫలితం.. అందరితో వ్యక్తిగతంగా చాలా దగ్గరయ్యే అవకాశం దక్కింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్‌’ అంటూ ద్రవిడ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు. ఆ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మరి ద్రవిడ్‌ స్పీచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments