SNP
SNP
దాదాపు 15 ఏళ్లకు పైబడిన కెరీర్, ఆ తర్వాత భారత అండర్-19 కోచ్‌గా ఆపై టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్‌కు వివాద రహితుడిగా పేరుంది. ఎప్పుడూ ఎవ్వరీతోనూ ద్రావిడ్‌కు గొడవలు లేవు. ప్రత్యర్థి జట్టు సభ్యులు ఎంత కవ్వించినా కూడా ద్రావిడ్ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడే కానీ, నోటికి ఏనాడు పనిచెప్పలేదు. కానీ.. ఇప్పుడు ఓ బార్ వెయిటర్‌తో ద్రావిడ్ వాదనకు దిగాడనే విషయం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెళ్లింది. బుధవారం నుంచి తొలి టెస్టు సైతం మొదలుకానుంది. అయితే.. తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు సరదాగా ఒక బీచ్‌కు వెళ్లారు. వారితో పాటు టీమిండియా హెడ్ కోచ్ అయిన ద్రావిడ్ కూడా వెళ్లాడు. అయితే.. బీచ్‌లో డ్రింక్స్ అందించే బార్ వెయిటర్, బార్ టెండర్‌తో ద్రావిడ్.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్ గురించి చర్చించాడు.
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో రనౌట్‌పై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. అయితే బెయిర్ స్టోది అవుటా? కాదా? అని బార్ టెండర్, వెయిటర్ ద్రావిడ్‌ను అడిగారు. దానిపై వారి ముగ్గురి మధ్య ఒక గంట సేపు హాట్ హాట్ డిబేట్ జరిగింది. మధ్యలో ఓ పెద్ద మనిషి వచ్చి బెయిర్ స్టోది అవుట్ అయి తేల్చేయడంతో వాదన ముగిసింది అని అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రేపటి నుంచే భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్! లైవ్ చూడండి ఇలా..