SNP
Rahul Dravid, Rohit Sharma, Nassau County Pitch, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు టీమిండియా అదిరపోయే గుడ్‌న్యూస్ అందింది. ఇది తెలిస్తే.. పాకిస్థాన్ దబిడిదిబిడి ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Rahul Dravid, Rohit Sharma, Nassau County Pitch, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు టీమిండియా అదిరపోయే గుడ్‌న్యూస్ అందింది. ఇది తెలిస్తే.. పాకిస్థాన్ దబిడిదిబిడి ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ధనాధన్ క్రికెట్ హంగామా మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికగా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2024 షురూ కానుంది. జూన్ 2 అంటే ఆదివారం నుంచి పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలవుతాయి. వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్‌లో క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న మ్యాచ్.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. క్రికెట్ ప్రపంచం మొత్తం పూనకం వచ్చినట్లు ఊగిపోయే మ్యాచ్ అది. జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ ఒకటి అందింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఇప్పటికే భారత జట్టు అమెరికాలో దిగిపోయి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఒక వామప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ వామప్ మ్యాచ్‌ను నసావు కౌంటీ స్టేడియంలోని ‘డ్రాప్ ఇన్ పిచ్’పై ఆడనుంది. అయితే.. ఈ పిచ్‌ను తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు. పిచ్‌ను పరిశీలించిన తర్వాత.. పిచ్‌పై వాళ్లు ఒక అంచనాకు వచ్చారు. ఈ పిచ్ ‘నార్మల్ అండ్ గుడ్’ అంటూ పేర్కొన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను భయపెడుతుంటే.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఎందుకంటే.. ఇదే పిచ్‌పై జూన్ 9 ఇండియా పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇండియా బలం బ్యాటింగ్, పాకిస్థాన్ బలం బౌలింగ్. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే.. టీమిండియా బ్యాటర్లను పాక్ బౌలర్లను అస్సలు ఆపలేరు. అసలే కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పైగా పాకిస్థాన్ అంటే ఎక్కడలేని శక్తినంతా తెచ్చుకుని మరీ ఆడతాడు. అందుకే పాకిస్థాన్‌కు ఇక దబిడిదిబిడే అంటున్నారు ఫ్యాన్స్.
పైగా ఇది డ్రాఫ ఇన్ పిచ్.. అంటే వేరే చోటు తయారు చేసి.. తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌స్టాల్ చేశారు. దాంతో ఈ పిచ్‌పై కొన్ని అనుమానులు ఉండేవి. కానీ, ద్రవిడ్, రోహిత్ పరిశీలించి.. అలాంటిదేం లేదు పిచ్ బాగానే ఉందని తేల్చేశారు. పైగా బంగ్లాదేశ్‌తో ఒక వామప్ మ్యాచ్ కూడా ఇదే పిచ్‌పై ఆడుతుండటంతో.. టీమిండియా ఆటగాళ్లకు ఈ పిచ్‌పై ఒక అవగాహన కూడా వస్తుంది. అయితే.. ఈ డ్రాప్ ఇన్ పిచ్‌ను ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తయారు చేశారు. అడిలైడ్ స్టేడియం క్యూరేటర్స్ ఈ పిచ్‌ను తయారు చేయడంతో ఆస్ట్రేలియాలో ఉండే పిచ్‌లా మాదిరిగా బౌన్స్ ఇంకా స్పీడ్ ఉంటుందేమో.. పాకిస్థాన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందేమో అని తొలుత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ, ఇప్పుడు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌ను పరిశీలించి.. రిపోర్ట్ వెల్లడించడంతో.. పాక్‌కు బ్యాండ్ బాజా బారాతే అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
head coach Rahul Dravid and skipper Rohit Sharma inspected the drop-in pitch at the Nassau County International Cricket Stadium in New York. According to a report , their first impression of the pitch was that it seemed “normal and good” and will most probably favour the batters.
— Sayyad Nag Pasha (@nag_pasha) May 31, 2024