iDreamPost
android-app
ios-app

సెమీస్‌కి ముందు నాయనమ్మ ఇంట్లో రచిన్ రవీంద్ర! దిష్టి తీసి మరీ..!

  • Published Nov 10, 2023 | 1:28 PM Updated Updated Nov 10, 2023 | 1:28 PM

టీమిండియాతో న్యూజిలాండ్‌ సెమీస్‌లో ఆడేందుకు రెడీ అయిపోతుంది. కానీ, ఆ జట్టులో ఓ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతనే రచిన్‌ రవీంద్ర. తాజాగా రచిన్‌కు వాళ్ల నాయనమ్మ దిష్టి తీస్తున్న వీడియో వైరల్‌ అయింది. ఇదంతా ఎక్కడ జరిగింది, అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాతో న్యూజిలాండ్‌ సెమీస్‌లో ఆడేందుకు రెడీ అయిపోతుంది. కానీ, ఆ జట్టులో ఓ కుర్రాడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతనే రచిన్‌ రవీంద్ర. తాజాగా రచిన్‌కు వాళ్ల నాయనమ్మ దిష్టి తీస్తున్న వీడియో వైరల్‌ అయింది. ఇదంతా ఎక్కడ జరిగింది, అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 10, 2023 | 1:28 PMUpdated Nov 10, 2023 | 1:28 PM
సెమీస్‌కి ముందు నాయనమ్మ ఇంట్లో రచిన్ రవీంద్ర! దిష్టి తీసి మరీ..!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లాస్ట్‌ ఫేజ్‌కి వచ్చేసింది. లీగ్‌ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్‌, శ్రీలంక మినహా మిగతా 8 జట్లుకు ఒక్కో మ్యాచ్‌ మిగిలి ఉంది. వీటిలో ఆఫ్ఘనిస్థాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా, పాకిస్థాన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లు నామమాత్రమే. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అధికారికంగా సెమీస్‌కు చేరిపోయాయి. ఇక మిగిలి ఒక్క​ స్థానం దాదాపు న్యూజిలాండ్‌కే ఖరారు కానుంది. అయితే.. పాకిస్థాన్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే పాక్‌కు కూడా సెమీస్‌ అవకాశాలు ఉండటంతో.. సెమీస్‌కు న్యూజిలాండ్‌ ఇంకా అధికారంగా చేరలేదు. కానీ, 99 పర్సంటేజ్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ ఆడే ఛాన్స్‌ ఉంది. అయితే.. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ నాలుగు వరుస ఓటముల తర్వాత.. శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

అయితే.. న్యూజిలాండ్‌ జట్టులో భారత సంతతికి చెందిన రచిన్‌ రవీంద్ర అనే కుర్రాడు ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లో 565 పరుగుల సాధించి ఈ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు రచిన్. ప్రస్తుతం అతనే టాప్‌ స్కోరర్‌. ఇప్పటికే మూడు సెంచరీలను కూడా బాదేశాడు. వాటితో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రచిన్‌ ఇదే విధంగా సెమీ ఫైనల్స్‌లో కూడా రాణించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. న్యూజిలాండ్‌ సెమీస్‌ స్పాట్‌ ఫిక్స్‌ అయితే తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడనుంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

అయితే.. చివరి లీగ్ మ్యాచ్‌ ఆడిన తర్వాత రచిన్‌ రవీంద్ర బెంగళూరులో వాళ్ల తాతయ్య ఇంటికి వెళ్లాడు. రోజంతా అక్కడే వాళ్లతో సంతోషంగా గడిపాడు. ఇంటికొచ్చిన మనవడిని మనసారా ఆశీర్వదించారు అతని నాయనమ్మ. ఈ సంరద్భంగా రచిన్‌కు దిష్టి తీయడం విశేషం. సాధారణంగా హిందు కుంటుబాలు తమ ఇంట్లో వాళ్లకు అప్పుడప్పుడు దిష్టి తీస్తారనే విషయం తెలిసిందే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ పలు విధాలుగా దిష్టి తీస్తారు. ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో దుమ్మరేపుతున్న రచిక్‌ కూడా ఎవరి దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో రచిన్‌కు దిష్టి తీయించారు. ఓ పెద్దావిడ రచిన్‌కు దిష్టి తీస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరు ఏ స్థాయికి ఎదిగినా.. ఎంత గొప్ప వాళ్లు అయినా కూడా తాతయ్య, నాయనమ్మలు, అమ్మమ్మలకు చిన్నపిల్లలే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి రచిన్‌కు దిష్టి తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet