Nidhan
Ravichandran Ashwin Criticizes Indigo Airlines: ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టైల్. మరో విషయంపై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దంటూ ఫ్యాన్స్‌కు సజెషన్ ఇచ్చాడు.
Ravichandran Ashwin Criticizes Indigo Airlines: ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టైల్. మరో విషయంపై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దంటూ ఫ్యాన్స్‌కు సజెషన్ ఇచ్చాడు.
Nidhan
గ్రౌండ్లో కూల్‌గా, కామ్‌గా ఉండే టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయట కూడా అలాగే ఉంటాడు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ పాజిటివిటీ ఉండేలా చూసుకుంటాడు. అయితే అశ్విన్‌లో మరో యాంగిల్ ఉంది. కూల్‌గా కనిపించే అతడు.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పేస్తాడు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో బాగా టచ్‌లో ఉండే ఈ స్టార్ ప్లేయర్.. క్రికెట్‌తో పాటు ఇతర విషయాల మీద కూడా తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటాడు. ఇదే క్రమంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మీద అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రయాణికులతో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై అశ్విన్ సీరియస్ అయ్యాడు. ఇండిగో టికెట్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ ఫైర్ అయ్యాడు.
ఇండిగో ఫ్లైట్ టికెట్స్ విషయంలో థర్డ్ పార్టీ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో సమస్యలు వస్తున్నాయని అశ్విన్ అన్నాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు ఇది కామన్ అయిపోయిందన్నాడు. రీసెంట్గా తనకు ఓ అనుభవం ఎదురైందన్న స్టార్ స్పిన్నర్.. వీళ్ల జోలికి వెళ్లకపోవడం బెటర్ అని సూచించాడు. కస్టమర్లతో తొలుత పేమెంట్ చేయించి.. ఆ తర్వాత వాళ్లకు నచ్చిన సీటింగ్‌నే కేటాయిస్తాయన్నాడు అశ్విన్. మనం ఏది సెలెక్ట్ చేసినా వాళ్లు పట్టించుకోరని.. ఇది కూడా ఓ స్కామే కావొచ్చన్నాడు. ఇక మీదట వారిని నమ్మొద్దని సజెషన్ ఇచ్చాడు. పేమెంట్ చేసినా బ్లాక్ చేసిన సీట్లను మాత్రం ప్యాసింజర్లకు ఇవ్వరని.. అందుకే మీ టైమ్, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దని ఓ పోస్ట్ పెట్టాడు అశ్విన్.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో రీసెంట్గా ఓ వృద్ధ దంపతులు టికెట్లు బుక్ చేశారు. కానీ వాళ్లకు రీజన్ చెప్పకుండా సీటింగ్ మార్చేశారు. నాలుగో వరుస నుంచి 19వ వరుసకు మార్చడంతో అక్కడికి వెళ్లేందుకు ఇరుకైన మార్గంలో ఆ వృద్ధ దంపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని ఫేమస్ కామెంటేటర్ హర్షా భోగ్లే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తాను వెళ్తున్న ఫ్లైట్‌లోనే ఈ ఘటన జరిగిందని తెలిపాడు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ సిస్టమ్ మీద అశ్విన్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దని.. అది స్కామ్ అంటూ సీరియస్ అయ్యాడు. గతంలో తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపాడు. ఈ కాంట్రవర్సీ మీద ఇండిగో ఇంకా స్పందించలేదు. మరి.. విమానాల్లో ప్రయాణించే సమయంలో సీటింగ్ కేటాయింపు విషయంలో మీరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
This is becoming a regular menace @IndiGo6E ,my recent experience with them through a third party booking platform was terrible, they make you pay and then end up doing whatever they choose to do.
Not sure if it’s a scam !!
heyyy who is ever going to pull them up ???
All we… https://t.co/cMTf4fFvKh
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 26, 2024