iDreamPost
android-app
ios-app

రిలేషన్‌షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన PV సింధు! .. ఏం చెప్పిందంటే?

  • Published Dec 06, 2023 | 7:37 AM Updated Updated Dec 06, 2023 | 7:37 AM

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాగా ఇటీవల సింధు ఓ పోడ్ క్యాస్ట్ లో పాల్గొని డేటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాగా ఇటీవల సింధు ఓ పోడ్ క్యాస్ట్ లో పాల్గొని డేటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?..

  • Published Dec 06, 2023 | 7:37 AMUpdated Dec 06, 2023 | 7:37 AM
రిలేషన్‌షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన PV సింధు! .. ఏం చెప్పిందంటే?

సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి తమ అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సినీ పరిశ్రమలోనే కాకుండా స్పోర్ట్స్ లోని ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అభిమానులు ఉంటారు. తమ అభిమాన ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలానే తాము అభిమానించే ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది.. అని ఆసక్తిగా తెలుసుకునే వారు కూడా ఉంటారు. అందులోను వారికీ సంబంధించిన రిలేషన్ షిప్ మ్యాటర్స్ లో అయితే.. ఇంకాస్త ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక సెలెబ్రిటీలు ఎపుడైనా ఇంటర్వ్యూస్ ఇస్తే.. వారికీ రిలేషన్ షిప్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడం సహజం. తాజాగా, భారత్ గర్విచదగ్గ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధుకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. తన ఆట గురించి కంటే తన వ్యక్తిగత విషయాల మీదనే ఎక్కువగా ప్రశ్నిస్తున్న వారికి సింధు తగిన సమాధానాలు ఇచ్చింది.

ఇటీవలే పి.వి. సింధు ఓ పోడ్ క్యాస్ట్ లో పాల్గొనింది. అందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు సింధును.. తన ఆట గురించి ప్రశ్నించడంతో పాటు పదే పదే తన వ్యక్తిగత విషయాలపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. ‘మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి’? అని అడిగారు. దానికి సింధు “సింగల్” అని సమాధానం ఇచ్చింది. “ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదనే నా ధ్యాస.. ఒలంపిక్స్ లో మరో మెడల్ సాధించడమే నా లక్ష్యం” అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే ‘మీ భాగస్వామి ఎలా ఉండాలి అనుకుంటున్నారు?’ అనే ప్రశ్నను సంధించారు. దానికి సింధు “ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమి లేవు, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదుటి రాతలో ఏది ఉంటె అది జరుగుతుంది” అంటూ జవాబు ఇచ్చింది. ఆ తర్వాత మరల వ్యక్తిగత ప్రశ్ననే అడిగారు. ‘మీరు ఎవరితోనైనా డేటింగ్ చేశారా?’ . ఈ ప్రశ్నకు “లేదు , అసలు లేదు” అంటూ సింధు చెప్పింది.

ఇలా వరుసగా అవే ప్రశ్నలు అడిగేసరికి సింధు ఆఖరికి ఇలా చెప్పింది . “అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పని లేదు. జీవితం అలా సాగిపోతుందంతే. ఏది ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతుంది అంతే.” అంటూ వెల్లడించింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గా మారాయి. కాగా పీ.వీ. సింధు ఇప్పటికే ఇండియా తరపున ఆడి ఎన్నో పతకాలను సాదించింది. రెండు సార్లు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ప్యారిస్ ఒలంపిక్స్ లో స్వర్ణం గెలవడమే సింధు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తన కోచ్ ప్రకాష్ పదుకొనే గైడెన్స్ లో ముందుకు సాగుతోంది. ఏదేమైనా సెలెబ్రెటీలకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం అనేది కామన్. మరి సింధు తన వ్యక్తిగత విషయాలకు స్పదించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom