iDreamPost
android-app
ios-app

వీడియో: క్యాచ్ మిస్.. అయినా బాల్ బాయ్​తో కలసి స్టార్ క్రికెటర్ సెలబ్రేషన్స్!

  • Published Mar 05, 2024 | 10:18 AM Updated Updated Mar 05, 2024 | 10:18 AM

బాల్ బాయ్​తో కలసి ఓ స్టార్ క్రికెటర్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరా ప్లేయర్? ఎందుకిలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

బాల్ బాయ్​తో కలసి ఓ స్టార్ క్రికెటర్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరా ప్లేయర్? ఎందుకిలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 05, 2024 | 10:18 AMUpdated Mar 05, 2024 | 10:18 AM
వీడియో: క్యాచ్ మిస్.. అయినా బాల్ బాయ్​తో కలసి స్టార్ క్రికెటర్ సెలబ్రేషన్స్!

క్రికెట్​ మ్యాచ్ అంటే కేవలం ప్లేయర్లు, అంపైర్లు మాత్రం ఉంటేనే సరిపోదు. పైకి ఆటగాళ్లు మాత్రమే కనిపిస్తున్నా.. ఒక మ్యాచ్ సక్సెస్​ఫుల్​గా జరగాలంటే చాలా మంది కృషి ఉండాలి. గ్రౌండ్ స్టాఫ్​, పిచ్ క్యూరేటర్, బాల్ బాయ్స్.. ఇలా ఎంతో మంది కష్టపడితేనే ఒక మ్యాచ్ విజయవంతం అవుతుంది. అయితే వారి కష్టం గురించి మాత్రం ఎక్కువ మందికి తెలియదు. కొంతమంది ఆటగాళ్లు మాత్రం వీరిని గుర్తిస్తారు. మ్యాచ్ సక్సెస్ అయ్యేందుకు సహకరించిన స్టాఫ్ అందరికీ అప్పుడప్పుడూ గిఫ్ట్​లు లాంటివి ఇస్తూ అభినందిస్తుంటారు. అయితే ఓ స్టార్ క్రికెటర్ మాత్రం బాల్ బాయ్​ను కౌగిలించుకున్నాడు. క్యాచ్ మిస్ అయినా అతడ్ని పట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ లీగ్-2024లో సోమవారం రాత్రి ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇస్లామాబాద్ 29 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే పెషావర్ ఇన్నింగ్స్ టైమ్​లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన ఓ బాల్​ సిక్స్​కు వెళ్లింది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఇస్లామాబాద్ ఆటగాడు కొలిన్ మున్రో దాన్ని అందుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరి వరకు బాల్​ను అందుకుందామని ప్రయత్నించాడు. కానీ బంతి చాలా ఎత్తులో ఉండటంతో అతడికి అందలేదు. అయితే ఆ బాల్​ను బౌండరీ రోప్​ లోపల ఉన్న బాల్ బాయ్ మాత్రం అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. దీంతో సంతోషంతో జోష్​లో ఉన్న అతడ్ని  మున్రో హత్తుకొని పైకి లేపాడు. బాల్ బాయ్​ను గట్టిగా కౌగిలించుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు.

సూపర్బ్ క్యాచ్​ అంటూ బాల్ బాయ్​ను మెచ్చుకున్నాడు మున్రో. అంతకుముందే సిక్స్​గా వెళ్లిన ఓ బాల్​ను పట్టుకునేందుకు బాల్ బాయ్ ప్రయత్నించాడు. కానీ అది తృటిలో చేజారింది. అయితే మున్రో అతడ్ని ఎంకరేజ్ చేశాడు. ఏమీ కాదులే.. బాగా ట్రై చేశావంటూ ప్రోత్సహించాడు. దీంతో ఇంకో బాల్ వస్తే పట్టుకుందామని కాచుకొని కూర్చున్నాడా కుర్రాడు. తక్కువ టైమ్​లోనే మరో బాల్ అటుగా రావడం, బాల్ బాయ్ దాన్ని పట్టేయడం జరిగిపోయాయి. దీంతో తాను క్యాచ్ పట్టకున్నా, బాల్ సిక్స్​కు పోయినా.. బాల్ బాయ్ దాన్ని అందుకోవడంతో మున్రో సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మున్రో మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్​లో బ్యాట్​తో మోస్తరుగా రాణించాడు మున్రో. 9 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. మరి.. మున్రో-బాల్ బాయ్ వీడియోపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL ముందు KKR జట్టులో ప్రకంపనలు! ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్!

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap