iDreamPost
android-app
ios-app

వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త హీరోయిన్ డ్యాన్స్! అదిరిపోయిందిగా..!

  • Published Aug 17, 2024 | 5:49 PM Updated Updated Aug 17, 2024 | 5:49 PM

Prabhas, Iman Esmail, Hanu Raghavapudi, Fauji: రెబల్‌ స్టార్‌ పక్కన నిలబడి ఒక్క ఫొటో దిగడంతోనే.. ఓ అమ్మాయి స్టార్‌ అయిపోయింది. అంతే.. ఆమె పాత వీడియోలు కూడా ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో మీ కోసం..

Prabhas, Iman Esmail, Hanu Raghavapudi, Fauji: రెబల్‌ స్టార్‌ పక్కన నిలబడి ఒక్క ఫొటో దిగడంతోనే.. ఓ అమ్మాయి స్టార్‌ అయిపోయింది. అంతే.. ఆమె పాత వీడియోలు కూడా ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో మీ కోసం..

  • Published Aug 17, 2024 | 5:49 PMUpdated Aug 17, 2024 | 5:49 PM
వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త హీరోయిన్ డ్యాన్స్! అదిరిపోయిందిగా..!

కల్కీ ఏడీ2898 సినిమా సూపర్‌ హిట్‌తో మంచి జోష్‌ మీదున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ‘సీతారామమ్‌’ లాంటి క్లాసిక్‌ తీసిన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాకు ‘ఫౌజి’ టైటిల్‌ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా మూవీ టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. పూజా కార్యక్రమంలో ప్రభాస్‌ పక్కన ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. ప్రభాస్‌ అభిమానులు, సినిమా ఫ్యాన్స్‌, నెటిజన్లు.. ఎవరీ అమ్మాయి అంటూ నెట్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. పైగా ఆమె డ్యాన్స్‌ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇమాన్‌ ఇస్మాయిల్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో ఆమె డ్యాన్స్‌ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తేంటే.. ఇమాన్‌ చాలా మంది డ్యాన్స్‌ర్‌ అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ప్రభాస్‌ పక్కన మూవీలో డ్యాన్స్‌ ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఇప్పటికే టాలీవుడ్‌లో అద్భుతంగా డ్యాన్స్‌ వేసే హీరోయిన్లు ఉన్నారు. సాయి పల్లవి, శ్రీలీల, నయా సెన్సేషన్‌ భాగ్య శ్రీ సూపర్‌గా డ్యాన్స్‌ చేస్తారు.. ఇప్పుడు వీరికి ఈ ఇమాన్‌ ఇస్మాయిల్‌ కూడా తోడవనుంది. ఢిల్లీకి చెందిన ఇమాన్‌ ఇస్మాయిల్‌.. 1995 అక్టోబర్‌ 20న జన్మించింది.

Prabhas's new heroine dance is going viral!

చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై ఇష్టంతో చదువుకుంటూనే డ్యాన్స్‌ నేర్చుకుంది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత.. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి.. తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్స్ ప్ల్యూయెన్సర్ గా మారింది. అలాగే పలు వేదికలపై డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఇప్పుడు ప్రభాస్‌ పక్కన పూజా కార్యక్రమంలో కనిపించగానే.. ఇంకా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ప్రభాస్‌తో ఫొటో తర్వాత.. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 686K ఫాలోవర్స్ ఉన్నారు. మరి కింద ఉన్న ఇమాన్‌ ఇస్మాయిల్‌ డ్యాన్స్‌ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet