RCB vs SRH: మ్యాచ్‌కి ముందు కోహ్లీ దగ్గరికి వెళ్లి మరీ వార్నింగ్‌ ఇచ్చిన కమిన్స్‌!

Pat Cummins, Virat Kohli, SRH vs RCB: ఆర్సీబీతో మ్యాచ్‌కి ముందు ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీకి నేరుగా వెళ్లి వార్నింగ్‌ ఇచ్చాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Pat Cummins, Virat Kohli, SRH vs RCB: ఆర్సీబీతో మ్యాచ్‌కి ముందు ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీకి నేరుగా వెళ్లి వార్నింగ్‌ ఇచ్చాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌. గురువారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ఈ సూపర్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంత భీకర ఫామ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లోని భారీ భారీ రికార్డులను సైతం తిరగరాస్తూ.. తాము సృష్టించిన రికార్డులను తామే బద్దలుకొడుతూ.. ప్రత్యర్థి జట్ల గుండెల్లో బుల్లెట్‌ రైళ్లు పరిగెట్టిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ.. 8లో 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. దాదాపు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. దీంతో.. ఆ జట్టు ఒత్తిడి లేకుండా ఫ్రీ క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. దీంతో.. ఈ రెండు జట్ల మధ్య సమరం భీకరంగా జరిగే ఛాన్స్‌ ఉంది.

ఈ క్రమంలోనే మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్‌ చేస్తున్న ఆర్సీబీ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి వద్దకు వెళ్లి మరీ ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ సీజన్‌లో భారీ భారీ స్కోర్లు చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే ఉప్పల్‌ పిచ్‌పై మరింత అగ్రెసివ్‌గా ఆడి.. 300 టార్గెట్‌ను కొట్టాలని అనుకుంటుంది. దీని కోసమే క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ 287 పరుగులు.. ఆర్సీబీపైనే ఇదే సీజన్‌లో చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఆర్సీబీ బౌలింగ్‌ ఎటాక్‌ చాలా చెత్తగా ఉండటంతో ఉప్పల్‌ లాంటి ఫ్లాట్‌ పిచ్‌పై 300 ​కొట్టడం పెద్ద కష్టం కాదేమో అని క్రికెట్‌ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌కు దిగితే.. వారి టార్గెట్‌ 300 పరుగులే అని అంతా ఫిక్స్‌ అయ్యారు.

ఇదే విషయాన్ని పరోక్షంగా కోహ్లీకి చెబుతూ.. ఆస్ట్రేలియాకు అలవాటైన మైండ్‌ గేమ్‌ను ఆడే ప్రయత్నం చేశాడు ప్యాట్‌ కమిన్స్‌. ప్రాక్టీస్‌ చేసి గ్రౌండ్‌లో కూర్చున్న విరాట్‌ కోహ్లీ దగ్గరికి వెళ్లి.. పిచ్‌ ప్లాట్‌గా ఉందని కోచ్‌ చెబుతున్నాడు అంటూ కోహ్లీతో అన్నాడు కమిన్స్.. దానికి కోహ్లీ బదులిస్తూ.. నువ్వు టూ గుడ్‌ ప్యాట్‌ అని అన్నాడు. పిచ్‌ ప్లాట్‌గా ఉంది.. నిన్ను వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో అవుట్‌ చేసినట్లు చేయడం సాధ్యం కాదని లేదా.. పిచ్‌ ప్లాట్‌గా ఉంది.. మేం 300 కొట్టేస్తాం అని ఇందులో ఏదో ఒకటి కమిన్స్‌ ఉద్దేశం అయి ఉంటుందని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి కమిన్స్‌ ఏం ఉద్దేశంతో అన్నాడో అతనికే తెలియాలి. ఆస్ట్రేలియా మైండ్‌ గేమ్‌ గురించి బాగా తెలిసి కోహ్లీ.. కమిన్స్‌తో పెద్దగా మాట్లాడలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments