SNP
Pat Cummins, IPL 2024, MI vs SRH: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసి గెలిచిందని చాలా మంది అనుకుంటున్నారు. అంత స్కోర్ చేసినా.. కమిన్స్ కెప్టెన్సీ స్కిల్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Pat Cummins, IPL 2024, MI vs SRH: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసి గెలిచిందని చాలా మంది అనుకుంటున్నారు. అంత స్కోర్ చేసినా.. కమిన్స్ కెప్టెన్సీ స్కిల్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హైస్కోరింగ్ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగులు పండుగ చేసుకున్నారు. రెండు టీమ్స్ కలిపి 40 ఓవర్లలోనే 523 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంత పెద్ద స్కోర్ చేసినా కూడా ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచేందుకు చెమటలు నిందించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీ అనుభవాన్ని ఉపయోగించి, ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముంబైని ట్రాప్‌లో పడేకపోయి ఉంటే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఈజీగా గెలిచేది. ఇంతకీ కమిన్స్ ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్యాటర్ల విధ్వంసంగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 278 పరుగుల భారీ టార్గెట్‌ను కూడా ముంబై ఒకానొక దశలో చేరుకుంటుందేమో అనిపించింది. ఎందుకంటే.. ఎస్‌ఆర్‌హెచ్ తొలి పది ఓవర్లలో 148 పరుగులు చేస్తే.. ముంబై కూడా పది ఓవర్లలో 141 పరుగులు చేసింది. పైగా ముంబై ఇండియన్స్‌లో ఇంకా హార్డ్ హిట్టర్లు ఉండటంతో ముంబై విజయం సాధించేలా కనిపించింది. కానీ, ఇక్కడే ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో చూపించాడు. టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువగా లెగ్‌సైడ్ ఫీల్డింగ్ పెట్టి.. బాల్స్‌ను అవుట్ సైడ్‌ది ఆఫ్ స్టంప్ వేయించాడు. టిమ్ డేవిడ్ బలం మొత్తం లెగ్‌సైడ్ వైపే బాల్స్ ఆఫ్ సైడ్ దూరంగా పడటంతో అతను గుంజి కొట్టాల్సి వచ్చింది. దాంతో.. సింగిల్స్ ఎక్కువగా వచ్చాయి.
కమిన్స్ కెప్టెన్సీ తెలివి వల్ల.. 15వ ఓవర్‌లో 3 పరుగులు, 16వ ఓవర్‌లో 5 పరుగులు, 19వ ఓవర్‌లో 7 రన్స్ మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్స్ మినహా ఇచ్చి.. మిగతా అన్ని ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్ అద్భుతమైన ఫీల్డ్ సెట్‌తో డేంజరస్‌గా ఆడుతున్న తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. అలాగే.. టిమ్ డేవిడ్ బలమేంటో బాగా తెలిసిన కమిన్స్.. అతని చేతులు కట్టేసేలా ఫీల్డ్ సెట్ చేసి.. బౌలింగ్ వేయించాడు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ విషయంలో కమిన్స్ ప్లాన్స్ వర్క్ అవుట్ అవ్వడం వల్లే ఈ మ్యాచ్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. లేదంటే.. అంత భారీ స్కోర్ చేసి కూడా సన్‌రైజర్స్ దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కమిన్స్ కెప్టెన్సీ స్కిల్స్ చూసిన తర్వాత.. ఇందకు కదా కమిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి కావ్య మారన్ కొనుగోలు చేసింది అంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ కమిన్స్ కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
12 bowlers were used last night in the run fest.
Only one of them managed to finish with an economy rate below 9 #SRHvMI
Pat Cummins 4-0-35-2 🫡 🫡 pic.twitter.com/62mNSDMZsG
— Cricbuzz (@cricbuzz) March 28, 2024