శాంసన్ అవుట్ అంటూ.. ఊగిపోయిన ఇతను ఎవరో తెలుసా? ఒక రేంజ్ బ్యాగ్రౌండ్!

Parth Jindal, Sanju Samson, RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అవుటైనప్పుడు ఒ వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ.. వైరల్‌ అయ్యాడు. అయితే.. అతను సాధారణ వ్యక్తి కాదు. అతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Parth Jindal, Sanju Samson, RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అవుటైనప్పుడు ఒ వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ.. వైరల్‌ అయ్యాడు. అయితే.. అతను సాధారణ వ్యక్తి కాదు. అతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స​్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం సాధించింది. అయితే.. ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ అవుట్‌పై మాత్రం వివాదం రాజుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 222 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో శాంసన్‌ అద్భుతంగా ఆడాడు. కానీ, ముఖేష్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నాలుగో బంతికి శాంసన్‌ లాంగ్‌ ఆన్‌ మీదుగా షాట్‌ ఆడాడు. కానీ, ఆ బాల్‌ను బౌండరీ లైన్‌ వద్ద షై హోప్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కానీ, రీప్లేలో చూస్తే అతను బౌండరీలైన్‌కు తగిలినట్లు అనిపించింది. కానీ, థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో శాంసన్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. ఈ సమయంలో స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న ఓ వ్యక్తి.. అవుట్‌.. అవుట్‌.. అంటూ వీరావేశంతో రెచ్చిపోయాడు. చాలా మంది ఎవరితను ఇంత ఎమోషన్‌ అవుతున్నాడు అని అనుకున్నారు. ఇంతకీ అతను ఎవరో తెలుసా..? ఢిల్లీ క్యాపిటల్స్‌ కో ఓనర్‌ పార్త్‌ జిందాల్‌. జిందాల్‌ గ్రూప్‌ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు.

పార్త్ జిందాల్ 1990 మే 19న జన్మించాడు. సజ్జన్ జిందాల్, సంగీత జిందాల్‌ల ముగ్గురు సంతానంలో చిన్నవాడు. ఇంగ్లండ్‌లోని సెవెనోక్స్ స్కూల్‌లో చదవి, బ్రౌన్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 2016లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ పూర్తి చేయడం కంటే ముందే.. వ్యాపారాన్ని చూసుకుంటూ మంచి ఫలితాలు సాధించాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన మార్క్‌ బిజినెస్‌ టెక్నిక్స్‌తో జిందాల్‌ గ్రూప్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, బెంగళూరు ఎఫ్‌సీకి సీఈఓగా ఉన్నాడు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని చాలా కంపెనీల్లో మరిన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2012లో జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో ఆర్థిక విశ్లేషకుడిగా చేరి వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. అలాగే జేఎఫ్‌ఈ స్టీల్ జపాన్‌తో ఆరు నెలల పాటు సెకండ్‌మెంట్ కూడా చేశాడు. అంతకంటే ముందు న్యూయార్క్ నగరంలోని ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్ అనే హెడ్జ్ ఫండ్‌తో కలిసి పనిచేశాడు .

జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కోసం కొత్త రిటైల్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జెఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ నష్టాల్లో ఉంటే.. వాటిని నష్టాల నుంచి బయటపడేశాడు. పార్త్‌ జిందాల్‌ సారథ్యంలోనే జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ ఉద్భవించింది. ఇలా జిందాల్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్న పార్త్‌ జిందాల్‌కు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు. సౌరవ్‌ గంగూలీ అంటే జిందాల్‌కు ఎంతో అభిమానం. అందుకోసమే.. దాదాను ఒప్పించి మరీ.. డీసీకి డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు. క్రికెట్‌పై తనకున్న ప్యాషన్‌తోనే గేమ్‌లో లీనమైపోతూ ఉంటాడు. తాజాగా ఆర్‌ఆర్‌ వర్సెస్‌ డీసీ మ్యాచ్‌లో కూడా సంజు శాంసన్‌ వికెట్‌ ఎంత ముఖ్యమో తెలిసి.. అవుట్‌.. అవుట్‌.. అంటూ మొత్తుకున్నాడు. వేల కోట్లలో వ్యాపారం చేస్తున్నా.. క్రికెట్‌పై ఉండే ఇష్టం అతన్ని ఓ సాధారణ అభిమానిని చేసేసిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా అంటున్నారు. మరి పార్త్‌ జిందాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments