Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు.. మరో రెజ్లర్‌పై వేటు.. కారణమిదే!

Antim Panghal Accreditation Cancelled: ఒలింపిక్స్‌లో భారత రెజ్లరను కష‍్టాలు వదలడం లేదు. తాజాగా మరో రెజ్లర్‌పై వేటు విధించే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు..

Antim Panghal Accreditation Cancelled: ఒలింపిక్స్‌లో భారత రెజ్లరను కష‍్టాలు వదలడం లేదు. తాజాగా మరో రెజ్లర్‌పై వేటు విధించే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు..

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ ఎక్కువ పతకాలు ఆశించింది రెజ్లింగ్‌ నుంచే. ఈ విభాగంలో కచ్చితంగా ఏదో ఒక పతకం అయితే పక్కా అని ప్రతి ఒక్కరు భావించారు. కానీ మన ఆశలను తలకిందులు చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో.. మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై ఫైనల్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. వినేశ్‌ కచ్చితంగా గోల్డ్‌ మెడల్‌ సాధిస్తుందని అంతా భావించారు. ఏదో ఒక పతకం పక్కా అనుకుంటున్న వేళ.. అసలు ఆమె ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు విధించడం.. క్రీడాభిమానులను కాక.. దేశ ప్రజలందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సెలబ్రిటీలు వినేశ్‌కు మద్దతుగా నిలిచి ధైర్యం చెబుతున్నారు. అనర్హత వేటు విధించిన నేపథ్యంలో వినేశ్‌ ఫొగాట్‌.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది. రిటైర్మెంట్‌ ప్రకటించింది.

వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో జరిగిన దాని నుంచి బయటకు రాక ముందే.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్‌ తగిలింది. మరో మహిళా రెజ్లర్‌ మీద వేటు విధించే అవకాశం ఉందని సమాచారం. ఆమెను పారిస్‌ ఒలింపిక్స్‌ వీడి వెళ్లాల్సిందిగా నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఏంటో ఈ ఒలంపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తారు అనుకున్న రెజ్లరను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. మరి ఏ రెజ్లర్‌ మీద అనర్హత వేటు వేశారంటే..

భారత రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌ అక్రిడిటేషన్‌ రద్దు చేశారు. అంతేకాక ఆమె పారిస్ వదిలి వెళ్లాలని నిర్వహకులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాన్ని వారు వెల్లడించారు. భారత్‌ రెజ్లర్‌ అంతిమ్‌ తన సోదరి, క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తప్పుడు అక్రిడిటేషన్ కార్డును ఉపయోగించిందని ఒలిపింక్‌ విలేజ్‌ సిబ్బంది తెలిపారు. భద్రతా అధికారులు అంతిమ్‌ సోదరిని పట్టుకున్నారు. అయితే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జోక్యంతో.. హెచ్చరించి ఆమెను వదిలేశారు. ఈ క్రమంలో అంతిమ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఆమెపై వేటు వేస్తారని తెలుస్తోంది.

ఏం జరిగిందంటే..

అంతిమ్‌ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరీలో తలపడింది. అయితే క్వార్టర్‌ ఫైనల్స్‌లో తుర్కియే రెజ్లర్‌ యెట్‌గిల్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె తన కోచ్‌లు భగత్‌ సింగ్‌, వికాస్ ఉంటున్న హోటల్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి.. తీసుకురమ్మని కోరింది. అందుకుగాను తన అక్రిడిటేషన్‌ కార్డును ఇచ్చింది. నిశా.. అంతిమ్‌ అక్రిడిటేషన్‌ కార్డు ఉపయోగించి క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకొన్నారు. నిషా నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని పంపించారు. అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు.

ఈ క్రమంలోనే అంతిమ్‌ అక్రిడిటేషన్‌ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్‌ నిర్వాహకులు.. దానిని రద్దు చేశారు. క్వార్టర్స్‌లో ఓడినప్పటికీ.. ‘రెపిఛేజ్‌’ ద్వారా పోటీలో నిలవాలని అంతిమ్‌ భావిస్తోంది. అయితే తాజా పరిణామంతో ఆమెపై వేటు పడే అవకాశం ఉందని.. అదే జరిగితే కాంస్య పతకం సాధించే అవకాశం కోల్పయినట్లే అని అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Show comments