Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ స్కోర్లు సాధిస్తూ.. ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ వీరబాదుడుకు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ స్కోర్లు సాధిస్తూ.. ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ వీరబాదుడుకు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Somesekhar
వన్డే క్రికెట్ లో 300 కొట్టడమే కొన్ని కొన్ని సార్లు గగనం అవుతుంది. అలాంటిది టీ20 ల్లో 280 కొట్టడం అంటే చిన్న విషయం కాదు. అలా ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. మూడు సార్లు 250కి పైగా బాదడం అంటే విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైన చెప్పుకున్న విధ్వంసం సృష్టిస్తూ.. ప్రత్యర్థి టీమ్స్ కు వణుకు పుట్టిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక SRH వీరబాదుడుకు దిగ్గజ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ కొట్టుడు ఏంది? అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇక సన్ రైజర్స్ కొట్టుడుకు పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్ విస్మయం వ్యక్తం చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి జట్లకు చలి జ్వరం పుడుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఢిల్లీపై 266/7, ముంబైపై 277/3, ఆర్సీబీపై 283/3 రికార్డు స్థాయిలో పరుగులు చేసింది. టీ20ల్లో ఈ స్కోర్లు చూసి క్రికెట్ ప్రపంచమే షాకైంది. SRH బ్యాటర్ల మెరుపు బ్యాటింగ్ ముందు అవతలి టీమ్స్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. కాగా.. సన్ రైజర్స్ కొడుతున్న భారీ స్కోర్లపై విస్మయం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్. ఓ ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడుతూ..
“నన్ను ఈ కాలంలో క్రికెట్ ఆడనివ్వనందుకు ఆ దేవుడికి థ్యాంక్స్. ఎందుకంటే? 20 ఓవర్లలో 270-280 స్కోర్లు చేయడం ఏంటి? ఈ లెక్కన చూస్తే.. వన్డేల్లో 450-500 మధ్య బాదినట్లే. అయితే ఒకసారి ఇలా జరిగితే ప్రేక్షకులు అంతగా పట్టించుకోరు. కానీ మూడు-నాలుగు సార్లు అంటే అశ్చర్యమే. పైగా 5 ఓవర్లలో 100 రన్స్ అంటే అన్యాయమే. ప్రతి బాల్ పుల్ టాస్ వేసినప్పటికీ.. అంత స్కోర్ కొట్టడం అసాధ్యం. ఐపీఎల్ లో బౌలర్లు డబ్బులు తీసుకుని మరీ నష్టపోతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ బౌలర్. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆర్సీబీ అత్యంత విధ్వంసకర జట్టు అని పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ ప్లేయర్లలో హెన్రిచ్ క్లాసెన్ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ తన నెక్ట్స్ మ్యాచ్ ను ఏప్రిల్ 25(గురువారం) ఆర్సీబీతో ఆడబోతోంది. మరి ఈ మ్యాచ్ లో ఏ రేంజ్ సునామీ సృష్టిస్తుందో చూడాలి. మరి పాక్ దిగ్గజం చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Home is where the heart is 🏡
Uppal is where the #OrangeArmy is 🧡🔥#PlayWithFire #SRHvRCB pic.twitter.com/HhNGZJdM9S
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024