వన్డే వరల్డ్ కప్-2023కు అంతా రెడీ అయిపోయింది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచ కప్ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఆరంభం కానుంది. మెగా టోర్నీలోని మొదటి మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికగా నిలవనుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా టీమ్స్ అన్ని ఇండియాకు వస్తున్నాయి. రీసెంట్గా హైదరాబాద్‌కు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. పాక్ టీమ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే వందలాది మంది క్రికెట్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దాయాది జట్టు హోటల్‌కు రాగానే అక్కడ కూడా కండువాలు కప్పి ఆహ్వానించారు.
భారత్ ఆతిథ్యం అద్భుతమని పాకిస్థాన్ క్రికెటర్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఇవి చూసిన పాక్ ఫ్యాన్స్ భారత్‌కు బాకీ పడ్డామని.. థ్యాంక్యూ ఇండియా అంటూ కామెంట్స్ పెట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 2025లో తమ దేశానికి వస్తే టీమిండియాకు ఇంతకు మించిన రేంజ్లో స్వాగతం చెబుతామని పాక్ అభిమానులు అంటున్నారు. ఆతిథ్యం సంగతి పక్కనబెడితే.. వార్మప్ మ్యాచులకు పాక్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో తలపడేందుకు దాయాది జట్టు సిద్ధమవుతోంది.
హైదరాబాద్‌లో దిగిన పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన అండర్-19 పేసర్ నిశాంత్ సరను తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ యంగ్ పేసర్ గంటకు 140 నుంచి 150 కి.మీ.ల వేగంతో బంతులు విసరగలడట. ఆరడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్లు కూడా బాగా వేస్తాడట. అందుకే నెట్ బౌలర్‌గా పాక్ అతడ్ని ఎంచుకుందట. నిశాంత్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న పాక్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. నిశాంత్ బౌలింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని.. అతడు కచ్చితంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని మెచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: వరల్డ్ కప్ టీమ్‌లో మార్పు.. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేశాడు!