Indian Hockey: మరోసారి ఇండియాపై విషం కక్కిన పాక్! హాకీ ఫైనల్ మ్యాచ్ లో..

Pakistan support China in Asia Hockey Champions Trophy 2024 final: తాజాగా జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో పాక్ నిజస్వరూపం మరొక్కసారి బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి.

Pakistan support China in Asia Hockey Champions Trophy 2024 final: తాజాగా జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో పాక్ నిజస్వరూపం మరొక్కసారి బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి.

భారత్-పాకిస్థాన్.. రెండు దేశాల మధ్య జరిగే ఏ చిన్న విషయం జరిగినా.. ప్రపంచ దేశాల దృష్టి మెుత్తం మన మీదే ఉంటుంది. ఇక పాక్ సమయం దొరికినప్పుడల్లా భారత్ పై విషం కక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా క్రీడల విషయంలో టీమిండియాపై నోరుపారేసుకుంటూ తన పరువును తానే తీసుకుంటుంది, ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా భారత్ పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. తాజాగా జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో పాక్ నిజస్వరూపం మరొక్కసారి బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే?

భారత హాకీ టీమ్ మరోసారి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024ను కైవసం చేసుకుని టైటిల్ ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్కో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.. ఫైనల్ కు వచ్చిన భారత్, ఫైనల్లో చైనా జట్టును 1-0తో ఓడిచింది. టైటిల్ పోరులో చైనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనా.. తన అసాధారణ ఆటతీరుతో డ్రాగన్ టీమ్ ను నిలువరించింది. ఇక జుగ్ రాజ్ చేసిన ఫీల్డ్ గోల్ తో టీమిండియా ట్రోఫీని దక్కించుకుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. భారత్-చైనా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ భారత్ పై ఉన్న కుళ్లును బయటపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో చైనా జట్టుకు సపోర్ట్ చేసింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? సెమీ ఫైనల్లో చైనా చేతిలోనే పాక్ ఓడిపోయింది.

కాగా.. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చూడటానికి పాక్ జట్టు స్టేడియానికి వచ్చింది. వచ్చి.. మ్యాచ్ చూసి వెళ్లిపోతే బానే ఉండేంది. కానీ చైనా చేతిలోనే ఓడిపోయి.. తుదిపోరులో కేవలం టీమిండియా ఉంది కాబట్టే డ్రాగన్ టీమ్ కు సపోర్ట్ చేసింది. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన పాక్ ఆటగాళ్లు చైనా జెండాలను పట్టుకుని, ముఖానికి చైనా జెండా పెయింటింగ్ లు కూడా వేసుకుని దర్శనం ఇచ్చారు. ఇది చూసిన ఇతర ప్రేక్షకులతో పాటుగా టీవీలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. వాళ్లు సపోర్ట్ చేసినప్పటికీ.. భారత్ ను ఓడించలేకపోయారు. ఇక ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారడంతో.. పాక్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు క్రీడాభిమానులు. మరీ ఇలా తయ్యారయ్యారేంట్రా బాబు.. కొంచెమైనా సిగ్గుండాలి వాళ్ల చేతిలోనే ఓడిపోయి.. వారికే సపోర్ట్ ఇవ్వడానికి అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఇక ఎప్పటికీ మారరా? ఇంకెన్నాళ్లు భారత్ పై విషయం కక్కుతారు? అని ఇతర దేశాల ఫ్యాన్స్ కూడా పాక్ తీరును విమర్శిస్తున్నారు. ఇక ఆసియా హాకీ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి గెలుచుకుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 5 సార్లు ట్రోఫీని ముద్దాడింది. మరి ఇండియాపై మరోసారి విషయం వెళ్లగక్కిన పాక్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments