పాకిస్థాన్‌ టీమ్‌.. మగాళ్లతో క్రికెట్‌ ఆడటం మానేసి.. వాళ్లతో ఆడుకోవడం బెటర్‌!

Kamran Akmal, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్‌ జట్టు పరువుతీసేలా కామెంట్స్‌ చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్‌. అసలు మగాళ్లతో క్రికెట్‌ ఆడేందుకు పాక్‌ జట్టు పనికిరాదనే తేల్చేశాడు. ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు? ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kamran Akmal, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్‌ జట్టు పరువుతీసేలా కామెంట్స్‌ చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్‌. అసలు మగాళ్లతో క్రికెట్‌ ఆడేందుకు పాక్‌ జట్టు పనికిరాదనే తేల్చేశాడు. ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు? ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్‌ జట్టుపై విమర్శల జడివాన కురుస్తోంది. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు ఆ జట్టును ఏకీపారేస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ కండీషన్లు వ్యతిరేకంగా ఉన్నా, టాస్‌ ఓడిపోయినా.. టీమిండియా మ్యాచ్‌ గెలిచి సత్తా చాటింది. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచేశాడంటూ చాలా మంది అనుకున్నారు. వారి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ.. టీమిండియా బౌలర్లు పాక్‌ను మట్టికరిపించారు. ఈ ఘోర ఓటమి తర్వాత పాక్‌ జట్టును పొట్టుపొట్టు తిడుతున్నారు ఆ దేశ మాజీలు.

తాజాగా పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ అయితే ఏకంగా.. ప్రస్తుత పాక్‌ జట్టు మెన్స్‌ క్రికెట్‌ ఆడేందుకు అస్సలు పనికి రాదని, వీళ్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఉమెన్స్‌ టీమ్స్‌తో మ్యాచ్‌లు ఆడాలని సూచిస్తూ.. దారుణంగా పరువుతీశాడు. కమ్రాన్‌ అక్మల్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాకపోవడం విశేషం. అంటే వాళ్లు కూడా అక్మల్‌ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. టీమిండియా లాంటి పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టును పాక్‌ బౌలర్లు కేవలం 119 పరుగులకే ఆలౌట్‌ చేసి ఔరా అనిపించారు.

కేవలం 120 పరుగుల స్వల్ప టార్గెట్‌ కావడంతో పాక్‌ ఈజీగా గెలుస్తుందని ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు కూడా భావించారు. వర్షం వల్ల మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడం, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వెంటవెంటనే అవుట్‌ కావడం, టీమిండియా మరీ దారుణంగా 119 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఎలాగో తమ జట్టు ఓడిపోతుందని.. చాలా మంది భారత క్రికెట్‌ అభిమానుల టీవీలు కట్టేసి పడుకున్నారు. కానీ, తెల్లారిలేచి చూసే సరికి టీమిండియా బౌలర్లు చేసిన అద్భుతం చూసి షాక్‌ అయ్యారు. 119 పరుగుల స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంటూ 113 పరుగులకే పాక్‌ను ఆలౌట్‌ చేసి.. అద్భుత విజయం అందించారు భారత బౌలర్లు. అందుకే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లకు అంతా మండిపోతుంది. మరి ఆ కోపంలోనే పాక్‌ జట్టు మగాళ్లతో క్రికెట్‌ ఆడేందుకు పనికి రాదని, ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్స్‌తో ఆడుకోవాలని కమ్రాన్‌ అక్మల్‌ సూచించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments