IPLపై మనసు పారేసుకున్న పాక్ పేసర్.. ఒక్క ఛాన్స్ అంటూ..!

  • Author Soma Sekhar Published - 09:39 AM, Tue - 28 November 23

పాకిస్థాన్ స్టార్ పేసర్ హసన్ అలీ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ పై మనసు పారేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో ఆడాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ స్టార్ పేసర్ హసన్ అలీ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ పై మనసు పారేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో ఆడాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Author Soma Sekhar Published - 09:39 AM, Tue - 28 November 23

IPL.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్ గా పేరుగాంచిన విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్యాష్ రిచ్ లీగ్ మన్ననలు అందుకుంటున్న ఈ టోర్నీలో ఆడాలని చాలా మంది ఆటగాళ్లకు కోరికగా ఉంటుంది. తమ కోరికను సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. గతంలో చాలా మంది క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడాలని ఉందని, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని చెప్పిన విషయం మనకు తెలియనిది కాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరాడు మరో ప్లేయర్. పాకిస్థాన్ స్టార్ పేసర్ హసన్ అలీ. ఐపీఎల్ పై తాను మనసు పారేసుకున్నానని, ఇలాంటి టోర్నీ ఆడాలని ప్రతీ ఆటగాడికి ఉంటుందని ఈ పాక్ పేసర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ లీగ్ ను బీసీసీఐ 2007 స్థాపించింది. కానీ 2008లో తన తొలి సీజన్ ను ప్రారంభించించి. ఇక స్టార్టింగ్ సీజన్ లో పలువురు పాక్ ప్లేయర్లు ఆడారు కూడా. అయితే ఆ తర్వాత ఇండియా-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్లేయర్లను ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ క్రికెట్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో.. అప్పటి నుంచి ఆట స్వరూపమే మారిపోయింది. ఈ టోర్నీ ప్రపంచ క్రికెట్ లో ఓ సంచలనాన్ని సృష్టించింది. డబ్బుకు డబ్బుతో పాటు ఇందులో రాణిస్తే.. తమ పేరు వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోతుంది. దీంతో ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడటానికి ఉవ్విళ్లూరుతూ ఉంటారు. నేను అందుకోసమే ఎదురుచూస్తున్నాను అంటున్నాడు పాక్ పేసర్ హసన్ అలీ.

“ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ లోనే అతి పెద్ద టోర్నీ. ఈ మెగా ఈవెంట్ లో ఆడేందుకు ప్రతీ ఒక్క ప్లేయర్ ఆసక్తి చూపుతాడు. నాక్కూడా ఐపీఎల్ లో ఆడాలని కోరికగా ఉంది. భవిష్యత్ లో అవకాశం వస్తే.. కచ్చితంగా ఆడతా. నాకూ ఒక అవకాశం ఇవ్వండి” అంటూ సామా టీవీతో మాట్లాడుతూ.. తన కోరికను బయటపెట్టాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాక్ ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొనలేరు. కాగా.. ప్రారంభ సీజన్ లో షోయబ్ మాలిక్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిదీలతో పాటుగా మరికొందరు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుంది. అందుకోసం ప్రేయర్ల రిటైన్షన్ విధానం నిర్వహించారు. ఆదివారంతో ఈ ప్రక్రియ ముగిసింది. గత సీజన్ లో విఫలం అయిన ఆటగాళ్లను పలు ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. మరికొందరు ఆటగాళ్లను యాజమాన్యాలు అంటిపెట్టుకునే ఉన్నాయి. మరి ఐపీఎల్ పై మనసు పారేసుకున్న పాక్ పేసర్ హసన్ అలీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments