బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఓటమికి.. ఇండియానే కారణం! రమీజ్‌ రజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Ramiz Raja, PAK vs BAN: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ అద్భుత విజయం సాధించింది. అయితే.. పాక్‌ ఓటమికి టీమిండియా కారణం అంటూ పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా పేర్కొన్నాడు. ఆయన అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Ramiz Raja, PAK vs BAN: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ అద్భుత విజయం సాధించింది. అయితే.. పాక్‌ ఓటమికి టీమిండియా కారణం అంటూ పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా పేర్కొన్నాడు. ఆయన అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ వెళ్లిన బంగ్లాదేశ్‌ సంచలన విజయం నమోదు చేసింది. పాక్‌ను వాళ్ల సొంత గడ్డపై ఓడించి.. అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన తర్వాత కూడా పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌ ఓడిపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఓటమితో పాకిస్థాన్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాక్‌ మాజీ క్రికెటర్లు.. ఓటమికి గల కారణాలు వివరిస్తూ.. పాక్‌ టీమ్‌ను ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, మాజీ పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఓడిపోవడానికి ‘ఇండియా ఫ్యాక్టర్‌’ కూడా పనిచేసిందంటూ.. ఒక విధంగా ఈ ఓటమికి కారణం టీమిండియానే అంటూ వ్యాఖ్యానించాడు.

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్లను టీమిండియా బ్యాటర్లు ఉతికి ఆరేశారని.. అప్పటి నుంచి పాకిస్థాన్‌ పతనం ప్రారంభం అయినట్లు రమీజ్‌ రజా తెలిపాడు. పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొవాలంటే.. ఎటాకింగ్‌ గేమ్‌ ఆడాలనే విషయం టీమిండియా బహిర్గతం చేసిందని.. దాన్నే అంతా ఫాలో అవుతున్నారంటూ ఆయన పేర్కొన్నాడు. భారీ పేస్‌ ఎటాక్‌తో దిగిన పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌ చాలా సులువుగా, సునాయసంగా ఎదుర్కొందని వెల్లడించాడు. ఇదంత పరోక్షంగా ఇండియా చేసిన నష్టంతోనే పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ బలహీన పడిందంటూ తెలిపాడు.

అలాగే.. పాకిస్థాన్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌పై కూడా రమీజ్‌ రజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కండీషన్స్‌ను సరిగ్గా అంచనా వేయడంలో మసూద్‌ దారుణంగా విఫలం అయ్యాడంటూ మండిపడ్డాడు. సరైన స్పిన్నర్లు లేకుండా బరిలోకి దిగడం, అలాగే తొలి ఇన్నింగ్స్‌ను 448 పరుగులకే డిక్లేర్‌ చేయడం వంటి నిర్ణయాలపై కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌ దారుణంగా తేలిపోయాడని అన్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ స్కిల్స్‌పై కూడా మసూద్‌ దృష్టి సారించాలని పేర్కొన్నాడు. మిగిలిన రెండో మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను సమం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వదేశంలో సిరీస్‌ ఓడిపోవడానికి వీల్లేదంటూ పాకిస్థాన్‌ టీమ్‌కు సూచించాడు. మరి బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఓటమికి కారణంగా.. టీమిండియా ఫ్యాక్టర్‌ అంటూ రమీజ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments