పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు షాకిచ్చిన PCB! అఫ్రిదీ, రిజ్వాన్‌కు కూడా..

Babar Azam, Shaheen Afridi, Mohammad Rizwan, GT20 League, PCB: పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్టార్లుగా ఉన్న బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదీ, రిజ్వాన్‌లకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఊహించని షాకిచ్చింది. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

Babar Azam, Shaheen Afridi, Mohammad Rizwan, GT20 League, PCB: పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్టార్లుగా ఉన్న బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదీ, రిజ్వాన్‌లకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఊహించని షాకిచ్చింది. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌, టీ20, వన్డే టీమ్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఊహించని షాక్‌ ఇచ్చింది. అతనితో పాటు పాకిస్థాన్‌ టీమ్‌లోని స్టార్‌ ఆటగాళ్లు.. షాహీన్‌ షా అఫ్రిదీ, మొహమ్మద్‌ రిజ్వాన్‌లకు కూడా గట్టి షాక్‌ ఇచ్చింది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. ఈ నెల 25 నుంచి కెనడా వేదికగా ప్రారంభం కానున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఈ ముగ్గురు క్రికెటర్లు ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముగ్గురి రిక్వెస్ట్‌ను పీసీబీ తిరస్కరిస్తూ.. గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి నిరాకరించింది.

ఆటగాళ్ల ఇష్టారాజ్యంగా ఉంటే పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఆటగాళ్ల రిక్వెస్ట్‌ను, అందులోనూ బాబర్‌ ఆజమ్‌ లాంటి స్టార్‌ క్రికెట్‌ రిక్వెస్ట్‌ను పీసీబీ తిరస్కరించడంతో అంతా షాక్‌ అయ్యారు. ఇది స్టార్‌ క్రికెటర్లకు తగిలిన ఎదురు దెబ్బగానే పాక్‌ మీడియా కూడా పేర్కొంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం లీగులు ఆడుకుంటూ.. దేశ తరఫున వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో దారుణంగా విఫలం అవుతున్న పాక్‌ ఆటగాళ్ల విషయంలో పీసీబీ మంచి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాక్‌ కనీసం గ్రూప్‌ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది.

అయితే.. బాబర్‌, అఫ్రిదీ, రిజ్వాన్‌ రిక్వెస్ట్‌లను తిరస్కరించడంపై పీసీబీ స్పందిస్తూ.. ఈ ముగ్గురు ఆల్‌ ఫార్మాట్‌(టెస్ట్‌, వన్డే, టీ20) ప్లేయర్స్‌ అని, పాకిస్థాన్‌ జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతోనే వారిని గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతించలేదని పేర్కొంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఉండటం, అలాగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో ఆటగాళ్లను బాగా ప్రిపేర్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్నెల్లో పాకిస్థాన్‌ 9 టెస్టుల, 14 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లు ఆడే బాబర్‌, అఫ్రిదీ, రిజ్వాన్‌ల వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకోని వారిని పంపడం లేదని వెల్లడించింది. ఇది ఆయా ఆటగాళ్ల మంచి కోసం తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments