వీడియో: ఈమధ్య కాలంలో ఇలాంటి క్యాచ్ చూసుండరు.. సింగిల్ హ్యాండ్​ గణేష్​ ఇక్కడ!

Benjamin Sleeman: క్రికెట్​లో ఎన్నో ఔట్​స్టాండింగ్ క్యాచెస్ చూసుంటారు. వాటిల్లో దీనికి తప్పక చోటు దక్కుతుందనే చెప్పాలి. ఈమధ్య కాలంలో ఇంత టెర్రిఫిక్ క్యాచ్‌ మాత్రం చూసుండరు.

Benjamin Sleeman: క్రికెట్​లో ఎన్నో ఔట్​స్టాండింగ్ క్యాచెస్ చూసుంటారు. వాటిల్లో దీనికి తప్పక చోటు దక్కుతుందనే చెప్పాలి. ఈమధ్య కాలంలో ఇంత టెర్రిఫిక్ క్యాచ్‌ మాత్రం చూసుండరు.

క్రికెట్​లో ఎక్కువగా బ్యాటర్లు, బౌలర్ల గురించి డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఎవరు మంచి ఇన్నింగ్స్​లు ఆడారు, ఎవరు గొప్పగా బౌలింగ్ చేశారు లాంటి విషయాలను అభిమానులు ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. స్టన్నింగ్ క్యాచెస్, మెరుపు రనౌట్లు చోటుచేసుకున్నప్పుడు సోషల్ మీడియాలోనూ వీటినే అందరూ షేర్ చేస్తూ ఉంటారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఫీల్డింగ్ ప్రమాణాలు పెరగడంతో అద్భుతమైన క్యాచ్​లు ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే.. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​లో సూర్యకుమార్ యాదవ్​ క్యాచ్​ బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత ఇదే బెస్ట్ క్యాచ్ అని నెటిజన్స్ అంటున్నారు.

క్రికెట్​లో ఎన్నో ఔట్​స్టాండింగ్ క్యాచెస్ చూసుంటారు. వాటిల్లో దీనికి తప్పక చోటు దక్కుతుందనే చెప్పాలి. ఈమధ్య కాలంలో ఇంత టెర్రిఫిక్ క్యాచ్‌ మాత్రం చూసుండరు. సింగిల్ హ్యాండ్ గణేష్​ ఇక్కడ అంటూ ఓ ఇంగ్లండ్ ప్లేయర్ ఒక్క చేత్తో గాల్లో ఎగురుతూ బంతిని పట్టేశాడు. సోమర్సెట్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఛారిటీ మ్యాచ్​లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. పేస్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ దిశగా దూసుకెళ్తున్న బంతి ఈజీగా ఫోర్​ లైన్​ను దాటేస్తుందని అనిపించింది. కానీ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన బెంజమిన్ స్లీమన్ అనే క్రికెటర్ గాల్లో పక్షిలా ఎగురుతూ ఎడమ చేతితో బంతిని అందుకున్నాడు. దీంతో అపోజిషన్ బ్యాటర్లు సహా సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు.

ఇదేం క్యాచ్​ రా బాబు, అలా ఎలా పట్టేశాడంటూ నాన్​స్ట్రయికర్ బ్యాటర్ నివ్వెరపోయాడు. ఆ అద్భుతాన్ని చూస్తూ ఉండిపోయాడు. తల మీద చేయి పెట్టుకొని ఆశ్చర్యపోయాడు. షాట్ కొట్టిన బ్యాటర్ కూడా నమ్మశక్యం కానట్లు అక్కడే ఉండిపోయాడు. కొద్ది సేపటి వరకు పిచ్​ దగ్గరే ఉండి ఆ తర్వాత పెవిలియన్ దిశగా నడక సాగించాడు. ఈ మ్యాచ్​కు సంబంధించి స్కోర్లు, బౌలర్లు, బ్యాటర్ల వివరాలు తెలియరాలేదు. కానీ క్యాచ్ పట్టిన ఫీల్డర్ బెంజమిన్ స్లీమన్ అని.. అతడి వయసు కేవలం 15 సంవత్సరాలు అని సమాచారం. దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వీడు మనిషా? పక్షా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ హ్యాండ్ గణేష్ ఇక్కడ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్డర్లు ఉంటే బ్యాటర్లు షాట్ బాదాలంటేనే భయపడాల్సి వస్తుందని అంటున్నారు. మరి.. బెంజమిన్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments