IPL 2024: RCB లిటిల్ ఫ్యాన్ శపథం! ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకు..

కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఓ లిటిల్ ఫ్యాన్ పట్టుకున్న పోస్టర్ వైరల్ గా మారింది. ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు తాను ఆ పని చేయనంటూ శపథం చేసింది ఈ అభిమాని. ఆ శపథం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఓ లిటిల్ ఫ్యాన్ పట్టుకున్న పోస్టర్ వైరల్ గా మారింది. ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు తాను ఆ పని చేయనంటూ శపథం చేసింది ఈ అభిమాని. ఆ శపథం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతీయులకు, క్రికెట్ కు విడదీయరాని సంబంధం ఉంది. దేశంలో మ్యాచ్ ఎక్కడ జరిగినా.. స్టేడియాలు ఫుల్ అవ్వడం పక్కా. చిన్నా, పెద్ద ముసలి ముతకా అనే తేడా లేకుండా దేశంలో ప్రతీ ఒక్కరు క్రికెట్ ను ప్రేమిస్తూ ఉంటారు. అంతలా ఈ క్రీడ భారతీయు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అది ఎంతలా అంటే మాటల్లో వర్ణించలేనంతగా. ఇక తమ అభిమాన ప్లేయర్లు, టీమ్స్ కొన్ని ఘనతలు సాధించాలని, అప్పటి వరకు పలానా పని చేయనని కొంత మంది శపథాలు చేస్తుంటారు. తాజాగా ఆర్సీబీకి చెందిన ఓ లిటిల్ ఫ్యాన్ చేసిన శపథం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఇంతకీ ఆ బుడత చేసిన శపథం ఏంటి? తెలుసుకుందాం పదండి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో ఈ టీమ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గత 16 సీజన్లు గా ఒక్క టైటిల్ గెలుచుకోకపోయినా.. ఇసుమంత కూడా ఫాలోయింగ్ తగ్గలేదు. పైగా ఇంకాస్త పెరుగుతూనే ఉంది. తమ అభిమాన జట్టు ఐపీఎల్ టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. ఇక కొందరు వీరాభిమానులైతే.. శపథాలు కూడా చేస్తున్నారు. తాజాగా కేకేఆర్ తో చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఓ లిటిల్ ఆర్సీబీ ఫ్యాన్ పట్టుకున్న పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందో తెలుసా?

కేకేఆర్-ఆర్సీబీ మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. వేలల్లో ప్రేక్షకులు ఉన్నారు. కానీ అందరి చూపు మాత్రం ఓ ఆర్సీబీ లిటిల్ ఫ్యాన్ పైనే ఉంది. ఆ చిన్నది బిగ్ స్క్రీన్ పై కనిపించగానే గ్రౌండ్ మెుత్తం ఆర్సీబీ నామ స్మరణతో దద్దరిలింది. ఆ లిటిల్ ఫ్యాన్ పట్టుకున్న పోస్టర్ లో..”రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకు నేను స్కూల్ కు వెళ్లను” అని రాసుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. ‘చదువుకోండి ఫస్ట్’.. ఈ వయసులో ఇలాంటి శపథాలు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీ చదువు కోసమైనా ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందని ఇంకొందరు రాసుకొచ్చారు. మరి ఈ ఫ్యాన్ చేసిన శపథంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మోదీపై అభ్యంతరకర పోస్ట్.. వివాదంలో టీమిండియా స్టార్ ప్లేయర్!

Show comments