SNP
Nicholas Pooran, CPL 2024, Chris Gayle: నికోలస్ పూరన్.. విధ్వంసానికి చిరునామాగా మారిపోతున్నాడు.. తాజాగా కరేబియన్ లీగ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ సిక్సులతో రెచ్చిపోయాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nicholas Pooran, CPL 2024, Chris Gayle: నికోలస్ పూరన్.. విధ్వంసానికి చిరునామాగా మారిపోతున్నాడు.. తాజాగా కరేబియన్ లీగ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ సిక్సులతో రెచ్చిపోయాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
కరేబియన్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ తన బ్యాట్ పవరేంటో మరోసారి చూపించాడు. బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా పరుగుల వరద పారించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు పూరన్. అతను సృష్టించిన విధ్వంసానికి ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏకంగా 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. పూరన్ విధ్వంసానికి నరైన్ కూడా జత కలిశాడు. ఇద్దరు కలిసి ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.
ఓపెనర్ జెసన్ రాయ్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి వెంటనే అవుటైనా.. ఆ తర్వాత పూరన్ ఊచకోత మొదలైంది. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సులతో 97 పరుగులు చేసి.. విధ్వంసం సృష్టించాడు. అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 38 పరుగులు చేసి అదరగొట్టాడు. వీళ్లద్దరే కాకుండా.. కీసీ కార్టీ అనే బ్యాటర్ సైతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు చేసి దుమ్మలేపాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ కొట్టిన 9 సిక్సులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఈ సిక్సులతో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా పూరన్ నిలిచాడు. 2024లో ఇప్పటి వరకు పూరన్ 139 సిక్సులు కొట్టాడు. 2015లో గేల్ కొట్టిన 135 సిక్సుల రికార్డును తాజాగా పూరన్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది మరో నాలుగు నెలలు మిగిలి ఉన్నాయి.. అతని నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూరన్ 97, కార్టీ 73, నరైన్ 38 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. పెట్రియాట్స్ జట్టులో నోర్జే రెండు వికెట్లతో రాణించాడు. ఇక 251 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పెట్రియాట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మికిల్ లూయిస్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు చేసి రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ సైతం 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేసి మెరుపు మెరిపించినా.. విజయానికి అవి సరిపోలేదు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పూరన్ విధ్వంసంతో నైట్ రైడర్స్ విజయం సాధించింది.
😮😮
Nicholas Pooran – 97 (7x4s; 9x6s)
Keacy Carty – 73* (9x4s; 3x6s)Trinbago Knight Riders 250/4 – the third-highest team total in CPL history! 👏👏https://t.co/kkGVdiIM0g pic.twitter.com/WtsPxiPtfU
— Cricbuzz (@cricbuzz) September 1, 2024