సెమీ ఫైనల్‌లో కొత్త రూల్స్‌..! ఇండియా-ఇంగ్లండ్‌లో ఎవరికి డేంజరంటే?

IND vs ENG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ​ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు కొత్త రూల్స్‌ పెట్టారు. అయితే ఆ రూల్స్‌తో ఓ జట్టు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రూల్స్‌ ఏంటి? ఎవరికి నష్టం అనేది ఇప్పుడు చూద్దాం..

IND vs ENG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ​ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు కొత్త రూల్స్‌ పెట్టారు. అయితే ఆ రూల్స్‌తో ఓ జట్టు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రూల్స్‌ ఏంటి? ఎవరికి నష్టం అనేది ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించిన సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ రెండు జట్లలో విజేత 29న సౌతాఫ్రికాతో ఫైనల్‌ ఆడనుంది. అయితే.. సూపర్‌ 8 మ్యాచ్‌లతో పోలిస్తే.. సెమీస్‌లో కాస్త రూల్స్‌ మారాయి. పైగా ఐసీసీ చేసిన కొన్ని మార్పులు ఇండియా, ఇంగ్లండ్‌ జట్లలో ఒకరికి తీవ్ర నష్టం చేయనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ వరల్డ్‌ కప్‌ జరిగినా.. సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే కేటాయిస్తారు. కానీ, ఈ వరల్డ్‌ కప్‌లో ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించలేదు. పైగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ట్రిండాడ్‌లో జరగాలి. కానీ ఏమైందో తెలియదు కానీ, ట్రినిడాడ్‌ నుంచి గయానాకు వేదిక మార్చారు. ఈ మార్పుపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే.. గయానాలో వర్షం కురిసేందుకు ఎక్కువ అవకాశం ఉండటంతో.. ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగడం కష్టంగానే మారింది. గయానాలో వర్షం వచ్చే అవకాశం 88 శాతం ఉన్నా.. కూడా రిజర్వ్‌ డే కేటాయించలేదు. కానీ, 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. అలాగే.. టీ20ల్లో వర్షం వల్ల మ్యాచకు అంతరాయం కలిగితే.. రెండు టీమ్స్‌ 5, 5 ఓవర్లు బ్యాటింగ్‌ చేస్తే మ్యాచ్‌ ఫలితాన్ని వెల్లడిస్తారు. కానీ, ఈ సెమీ ఫైనల్‌కు 10, 10 ఓవర్లు బ్యాటింగ్‌ చేయాలంటూ కొత్త నిబంధన పెట్టారు. ఈ రూల్స్‌ అన్ని ఇండియాకు కలిసి వచ్చేలా, ఇంగ్లండ్‌ కొంపముంచేలా ఉన్నాయి. ఎందుకంటే.. సూపర్‌ 8లో గ్రూప్‌ 1 టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఇండియా.. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు అయితే నేరుగా ఫైనల్‌ చేరుతుంది. ఇంగ్లండ్‌ ఇంటికి వెళ్తుంది. మరి కొత్త రూల్స్‌ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments