iDreamPost
android-app
ios-app

Mohammad Rizwan: పాపం రిజ్వాన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు! ఇది పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ..!

  • Published Jan 18, 2024 | 5:12 PM Updated Updated Jan 18, 2024 | 5:42 PM

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అతడిపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటివి పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అతడిపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటివి పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Jan 18, 2024 | 5:12 PMUpdated Jan 18, 2024 | 5:42 PM
Mohammad Rizwan: పాపం రిజ్వాన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు! ఇది పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ..!

పాకిస్తాన్.. వరల్డ్ కప్ నుంచి తన ఓటముల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈ మెగాటోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ సిరీస్ ను 3-0తో ఓడిపోయి పరువుపోగొట్టుకుంది. కంగారూ గడ్డపై జరిగిన ఈ సిరీస్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ తో తీవ్ర విమర్శలపాలైంది. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూసి.. మీ కంటే గల్లీ క్రికెటర్లు నయం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసిన విషయం తెలిందే. ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కూడా చేజార్చుకుంది పాక్. రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే.. సిరీస్ ను 3-0తో కివీస్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన మూడో మ్యాచ్ లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అతడిపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటివి పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

తాజాగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 45 రన్స్ తేడాతో పాక్ ను చిత్తు చేసి.. సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ స్టార్ ప్లేయర్,ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అతడు ఏం చేశాడు అంటే? తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 62 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్స్ లతో 137 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

ఇక అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసి.. 45 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే.. మహ్మద్ రిజ్వాన్ ఓ విచిత్రమైన విన్యాసం చేశాడు. కివీస్ బౌలర్ వేసిన ఓ బంతిని కొట్టాడు రిజ్వాన్. ఈ క్రమంలో అతడి కాలు జారడంతో.. బ్యాట్ కాస్త చేతిలోంచి కిందపడింది. దీంతో బ్యాట్ ను అక్కడే వదిలి అలాగే పరిగెత్తిన రిజ్వాన్ రెండు రన్స్ పూర్తి చేశాడు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ రిప్లేలో కనిపించింది.

మహ్మద్ రిజ్వాన్ తొలి రన్ పూర్తి చేసే క్రమంలో సరిగ్గా క్రీజ్ లోపలకి చేయిని పెట్టలేదు. దీంతో ఒక్క రన్ మాత్రమే వచ్చింది. పైగా డైవ్ చేస్తూ మరీ రన్ పూర్తి చేశాడు రిజ్వాన్. పాపం ఇంత కష్టపడి రన్స్ తీసినా.. ఒక్కటే వచ్చింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిదానంగా బ్యాట్ తీసుకుని ఒక్క పరుగు తీయోచ్చుకదా రిజ్వాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి పాక్ ప్లేయర్లకే సాధ్యం అంటూ మరికొందరు ప్లేయర్లు రాసుకొస్తున్నారు. ఇంకొందరు రిజ్వాన్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రిజ్వాన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio