సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక మరికొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఫన్నీ సన్నివేశమే సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో జరిగింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సఫారీ జట్టుకు షాకించింది పసికూన నెదర్లాండ్స్. 38 పరుగుల తేడాతో పటిష్టమైన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ నవ్వులు పూయించే సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డచ్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఓ ఫన్నీ దృశ్యం అందరి చేత నవ్వులు పూయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసేందుకు వచ్చాయి. అయితే తన తొలి ఓవర్ వేసేందుకు చాలా కష్టపడ్డాడు గెరాల్డ్ కొయెట్జీ. మెుదటి బంతిని వైడ్ వేసిన అతడు.. రెండో బంతిని మరీ విచిత్రంగా సంధించాడు. అతడు వేసిన రెండో బంతి బ్యాటర్ కు బారెడు దూరంగా వెళ్లి సరాసరి స్లిప్ లో ఉన్న క్లాసెన్ చేతిలో పడింది. ఇది చూసిన కీపర్ డికాక్ కంగుతిన్నాడు.
అయితే ఒక్కసారిగా ఈ బాల్ చూసిన వారు క్యాచ్ అనుకున్నారు. కానీ తర్వాత వైడ్ అని తెలిసి ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఇక ఇందుకు సంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదేం బాల్ రా బాబు.. గల్లీ క్రికెట్ ను తలపించావ్ బ్రో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. డచ్ బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లకు 207 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 38 పరుగులతో ఓటమిపాలైంది.