iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీతో గొడవపై నోరువిప్పిన నవీన్ ఉల్ హక్! కోహ్లీనే గొడవ స్టార్ట్ చేశాడంటూ..

  • Author Soma Sekhar Updated - 01:48 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Updated - 01:48 PM, Fri - 16 June 23
Virat Kohli: కోహ్లీతో గొడవపై నోరువిప్పిన  నవీన్ ఉల్ హక్! కోహ్లీనే గొడవ స్టార్ట్ చేశాడంటూ..

2023 ఐపీఎల్.. రికార్డులకు, గొడవలకు వేదికగా మారింది. ఇక ఈ సీజన్ లో పెద్ద దుమారం రేపిన ఘటన ఏదైనా ఉంది అంటే అంది టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఆఫ్గన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కు మధ్య జరిగిన గొడవ అనే చెప్పాలి. ఆర్సీబీ, లక్నో మధ్య మ్యాచ్ జరగ్గా .. ఈ మ్యాచ్ లో విరాట్ కు నవీన్ ఉల్ హక్ కు గొడవ జరిగింది. ఈ గొడవలోకి లక్నో మెంటర్ గా ఉన్న గంభీర్ రావడంతో..చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. తాజాగా ఈ వివాదంపై స్పందించాడు ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ ఉల్ హక్. అసలు ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసిందే విరాట్ కోహ్లీ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవను ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. అంతలా ఆ గొడవ వివాదంగా మారింది. మరీ ముఖ్యంగా ఈ గొడవ జరిగిన తర్వాత ఆర్సీబీని ఎగతాళి చేసేందుకు నవీన్ ‘మ్యాంగోస్’ అంటూ పోస్ట్ పెట్టడంతో.. గొడవ మరింత ముదిరింది. దాంతో లక్నో ఆడే ప్రతి మ్యాచ్ లో విరాట్ ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ వివాదంపై ఇన్ని రోజుల తర్వాత నోరు విప్పాడు నవీన్ ఉల్ హక్. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోజు గ్రౌండ్ లో ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు.

నవీన్ ఉల్ హక్ మాట్లాడుతూ..”మ్యాచ్ టైమ్ లో కోహ్లీ నన్ను చాలా మాటలు అన్నాడు. అలా అనకుండా ఉండాల్సింది. అసలు గొడవ మెుదట మెుదటు పెట్టిందే కోహ్లీ. మ్యాచ్ అనంతరం నేను కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కూడా విరాట్ గొడవ పడ్డాడు. ఇక మాపై వేసిన ఫైన్స్ చూస్తేనే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది” అంటూ ఆ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అదీకాక నేను సాధారణంగా స్లెడ్జింగ్ చేయను. ఒక వేళచేసినా అది బౌలింగ్ చేసేటప్పుడు బ్యాటర్ పై చేస్తానని నవీన్ తెలిపాడు.

ఇక విమర్శలపై నవీన్ ఉల్ హక్ స్పందిస్తూ..”విమర్శలు నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. అదీకాక క్రిటిక్స్ నోర్లు ఎలా మూయించాలో నాకు తెలుసు. 80 వేల మంది ప్రేక్షకులతో గొడవ పడాల్సిన అవసరం నాకు లేదు” అంటూ పేర్కొన్నాడు. మరి ఫస్ట్ కోహ్లీనే గొడవ స్టార్ట్ చేశాడు అన్న నవీన్ కామెంట్స్ పై కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/