Naveen ul Haq: బిగ్‌ బ్రేకింగ్‌: నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం! కారణం ఏంటంటే..?

కోహ్లీతో గొడవ తర్వాత మంచి పాపులారిటీని పొందిన ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌. మంచి బౌలర్‌ అయినప్పుటికీ.. కోహ్లీతో వివాదం తర్వాతే వెలుగులోకి వచ్చాడు. అయితే.. తాజాగా ఈ ఆటగాడిపై 20 నెలల నిషేధం విధించారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

కోహ్లీతో గొడవ తర్వాత మంచి పాపులారిటీని పొందిన ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌. మంచి బౌలర్‌ అయినప్పుటికీ.. కోహ్లీతో వివాదం తర్వాతే వెలుగులోకి వచ్చాడు. అయితే.. తాజాగా ఈ ఆటగాడిపై 20 నెలల నిషేధం విధించారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘనిస్థాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం విధిస్తూ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 నిర్వహకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌లో ఆడుతున్నా.. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీతో గొడవ కారణంగా బాగా పాపులర్‌ అయిన నవీన్‌ ఉల్‌ హక్‌.. తాజాగా 20 నెలల నిషేధానికి గురయ్యాడు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐఎల్‌టీ20(ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20)లో షార్జా వారియర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న నవీన్‌ ఉల్‌ హక్‌.. లీగ్‌ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతనిపై ఏకంగా 20 నెలల పాటు నిషేధం విధించినట్లు సమాచారం. 20 నెలల పాటు నిషేధం ఉండటంతో నవీన్‌.. ప్రస్తుతం జరుగుతున్న లీగ్‌తో పాటు, వచ్చే ఏడాది లీగ్‌కు పూర్తిగా దూరం కానున్నాడు.

అయితే.. ఐపీఎల్‌ 2023 సందర్భంగా విరాట్‌ కోహ్లీతో నవీన్‌ గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్న నవీన్‌ ఉల్‌ హక్‌.. ఆర్సీబీ-లక్నో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీకి అతనికి మధ్య ఏదో మాటామాట పెరిగి.. తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ గొడవలో గౌతమ్‌ గంభీర్‌ సైతం జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత పెద్దగైంది. ఆ గొడవతో కోహ్లీ అభిమానులు నవీన్‌ను దారుణంగా ట్రోల్‌ చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఆడేందుకు వచ్చిన నవీన్‌ను కోహ్లీ ఫ్యాన్స్‌ ఏడిపించారు. చివరి భారత్‌-ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌ సందర్భంగా పెద్ద మనసు చేసుకున్న కోహ్లీ.. ఆ గొడవకు ఎండ్‌ కార్డ్‌ వేశాడు. అప్పటి నుంచి నవీన్‌ను కోహ్లీ ఫ్యాన్స్‌ సపోర్ట్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఐపీఎల్‌లో నవీన్‌ ఇలా గుర్తింపు తెచ్చుకుంటే.. తాజాగా ఐఎల్‌టీ20 నుంచి మాత్రం నిషేధానికి గురయ్యాడు. అతనిపై బ్యాన్‌ ఎందుకు వేశారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి నవీన్‌పై బ్యాన్‌ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments