అనామక ఆటగాడి ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ!

fastest T20I Century: ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. నమీబియాకు చెందిన ఓ అనామక ఆటగాడు టీ20 క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

fastest T20I Century: ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. నమీబియాకు చెందిన ఓ అనామక ఆటగాడు టీ20 క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్, థండర్ బ్యాటింగ్, విధ్వంసం.. ఇలాంటి మాటలేవీ సరిపోవు అనుకుంటా ఇతడి బ్యాటింగ్ ను పొగడడానికి. అలా అని అతడేమీ స్టార్ బ్యాటర్ కాదు.. ఓ పసికూన జట్టులో అనామక ఆటగాడు. అందుకే అన్నాడేమో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు’. తాజాగా ఇలాంటి ఓ అద్భుతమే చేశాడు నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్. టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. తాజాగా నేపాల్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో నమీబియా ప్లేయర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ విశ్వరూపం చూపాడు. ట్రై సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. పొట్టి క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఘనతకెక్కాడు. దీంతో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా నెలకొల్పిన 34 బంతుల్లో శతకం రికార్డు బద్దలైంది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మంగోలియాపై అతడు ఈ రికార్డు నెలకొల్పాడు.

ఇక ఈ మ్యాచ్ లో నికోల్ లాఫ్టీ నేపాల్ బౌలర్లపై ఓ మినీ యుద్ధాన్నే ప్రకటించాడు. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి దశలో బ్యాటింగ్ కు వచ్చాడు నికోల్. అప్పటికే సగం ఓవర్లు పూర్తి అయ్యాయి. దీంతో నమీబియా జట్టు 120 పరుగులు చేస్తే.. గొప్పే అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా చెలరేగిన జాన్ నికోల్.. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. సిక్సులు, ఫోర్లుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే సెంచరీ చేసి తనపేరిట ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఓవరాల్ గా 36 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, 8 సిక్సులతో 101 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔట్ అయ్యాడు. అతడికి తోడు ఓపెనర్ మలన్ కృగర్ 59 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కాగా.. ఈ ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు జాబితాలో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్( 35 బాల్స్, 36 బాల్స్), క్రెగ్ రిపబ్లిక్ సుదేశ్ విక్రమశేఖర(36 బాల్స్), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 43 బంతుల్లో శ్రీలంకపై ఫాస్టెస్ సెంచరీలను నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. నికోలస్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 207 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ టీమ్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. బౌలింగ్ లోనూ సత్తాచాటిన నికోల్ రెండు వికెట్లు పడగొట్టారు. మరి ఓ అనామక ఆటగాడు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అలాంటి వారికే టీమ్ లో చోటు.. పాండ్యా, ఇషాన్ కు రోహిత్ ఇండైరెక్ట్ వార్నింగ్!

Show comments